ప్రచురునార్ధం అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని జిల్లాస్థాయి మహిళ, శిశు సంక్షేమ శాఖ తరపున ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ కొత్త వాడ లోని పద్మశాలి భవన్లో ఘనంగా జరిగినాయి.

ప్రచురునార్ధం

అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని జిల్లాస్థాయి మహిళ, శిశు సంక్షేమ శాఖ తరపున ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ కొత్త వాడ లోని పద్మశాలి భవన్లో ఘనంగా జరిగినాయి.

ఈ కార్యక్రమములో మొదటగా గౌరవ అతిథులందరూ జ్యోతి ప్రజ్వలన చేసినారు.

ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్
ప్రావీణ్య ఐఏఎస్ పాల్గొని మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని… మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఆరోగ్య పథకాలన్నింటిలో ముఖ్యంగా మహిళా ఆరోగ్య కార్యక్రమము లలో పాల్గొనాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

మహిళలలో అనంత శక్తి దాగి ఉందని స్త్రీ శిశు సంక్షేమ శాఖ వరంగల్ జిల్లా ఇతర సమన్వయ శాఖలతో సమన్వయం చేసుకుంటూ జిల్లా అభివృద్ధి పథంలో నడిపించడానికి సాయ శక్తులుగా కృషి చేయాలని తెలియజేశారు.

వరంగల్ నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి మాట్లాడుతూ కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో నేడు మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారని ముఖ్యంగా రాజకీయ రంగాల్లో కూడా కాకతీయ సామ్రాజ రాణి రుద్రమదేవి స్ఫూర్తితో రాణిస్తున్నారని తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళా సంక్షేమ పథకాలను వినియోగించుకొని సమాజ నిర్మాణంలో కీలకపాత్ర వహించాలని ఈ సందర్భంగా తెలిపారు.

మహిళ శిశు సంక్షేమ శాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ శ్రీమతి ఝాన్సీ లక్ష్మీబాయి మాట్లాడుతూ అంతర్జాతీయ సెలబ్రేషన్స్ చాలా ఘనంగా జరుపుతున్నందుకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు

ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయిలో వివిధ క్రీడా పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు

అనంతరం సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ జరిగింది

ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీం, స్థానిక కార్పొరేటర్ ఆడెపు స్వప్న హనంకొండ జిల్లా సంక్షేమ శాఖ అధికారి శ్రీమతి సబిత,
వరంగల్ జిల్లా సిడిపివోలు, సూపర్వైజర్లు పోషన్ అభియాన్ అధికారులు, సఖి ఉద్యోగులు, ఐ సి పి ఎస్ ఉద్యోగులు మరియు చైల్డ్ లైన్ నెంబర్, దివ్యాంగులు మరియు వయోవృద్ధుల శాఖ అధికారులు పాల్గొన్నారు.

Share This Post