ప్రజలందరికీ సేవ చేయాలని తెలంగాణ, భారత దేశం సుభిక్షంగా ఉండాలి:: రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్

ప్రజలందరికీ సేవ చేయాలని తెలంగాణ, భారత దేశం సుభిక్షంగా ఉండాలి:: రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్

ప్రచురణార్థం-1
కాళేశ్వరం, ఏప్రిల్ 21: త్రివేణి సంగమం ప్రాణహిత పుష్కరాలలో భాగంగా నేడు కాళేశ్వరం వద్ద స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ జెడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి గండ్ర జ్యోతి, కలెక్టర్ భవేష్ మిశ్రాలతో కలిసి రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు పుష్కర స్నానం ఆచరించి, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కాళేశ్వరం శ్రీ ముక్తిశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడుతూ, ప్రాణహిత పుష్కరాలు ఈ నెల 13 నుంచి మొదలై 24 వరకు జరుగుతాయని, ఇందుకోసం ప్రభుత్వం ఏర్పాట్లు అద్భుతంగా చేసిందని అన్నారు. పుష్కరాలకు రావడం పట్ల చాలా సంతోషంగా వున్నట్లు ఆమె తెలిపారు. పుష్కరాలపై గతంలోనే అధికారులతో సమీక్ష చేసి అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పామని, ఇందుకుగాను 2 కోట్ల రూపాయలను ఖర్చు చేయాలని విడుదల చేశామని మంత్రి అన్నారు. ఇబ్బందులు లేకుండా ప్రజలు పుష్కర స్నానం చేసి స్వామి వారిని దర్శించుకుంటున్నారని ఆమె తెలిపారు. వచ్చే మూడు రోజులు భక్తులు పెరిగే అవకాశం ఉందని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. కాళేశ్వరానికి ప్రపంచ స్థాయి గుర్తింపు, గౌరవాన్ని సీఎం కేసిఆర్ తీసుకొచ్చారని ఆమె అన్నారు. కాళేశ్వరం దేశంలోనే ప్రత్యేక ప్రాజెక్టని, నీళ్లను ఎగువకు తీసుకెళ్లే అద్భుతమైన ప్రాజెక్ట్ అని, అనుకున్న సమయం కంటే ముందే కట్టి రాష్ట్రాన్ని సస్య శ్యామలం చేశారని ఆమె తెలిపారు. ఈ ప్రాజెక్టుకు కాళేశ్వర ప్రాజెక్టుగా పేరు పెట్టడం వల్ల ఆ ముక్తేశ్వర స్వామి ఆశీర్వాదం పూర్తిగా ఉందన్నారు. రైతులకు రెండు పంటలకు ఈ ప్రాజెక్టు ద్వారా నీరు ఇస్తూ, తెలంగాణ రాష్ట్రాన్ని పచ్చ తీవాచి పరిచినట్లు, రైతులు సంతోషంగా ఉండేటట్లు చేశారన్నారు. తెలంగాణ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం పని చేస్తున్న సీఎం కేసిఆర్ ను మరింత శక్తివంతం చేయాలని ప్రార్థించినట్లు మంత్రి తెలిపారు. ప్రజలకు ఆయన మరిన్ని కార్యక్రమాలు చేసేలా ఆశీర్వదించాలని కోరుకున్నానన్నారు. తెలంగాణ రాష్ట్ర పథకాలు చూసి దేశంలోని అనేక రాష్ట్రాలు అబ్బురపడుతున్నాయని, 75 ఏళ్లలో రైతుల కోసం ఏ రాష్ట్రంలో అమలు కానివి సీఎం కేసిఆర్ నేడు తెలంగాణలో అమలు చేస్తున్నారని ఆమె తెలిపారు. తెలంగాణలో అమలు అవుతున్న కార్యక్రమాలు దేశమంతా అమలు కావాలంటే కేసిఆర్ వంటి నాయకుడు దేశానికి నాయకత్వం వహించే శక్తి ఇవ్వాలని, ఆ విధంగా ఆశీర్వదించాలని కోరుకున్నానని ఆమె అన్నారు. ప్రజలందరికీ సేవ చేయాలని తెలంగాణ, భారత దేశం సుభిక్షంగా ఉండాలని ఆ ముక్తేశ్వర స్వామినీ ప్రార్థించినట్లు మంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థ అదనపు కలెక్టర్ దివాకర టిఎస్, డిఎస్పీ బినాల కిషన్, జెడ్పీ సిఇవో శోభారాణి, ఆలయ ఇవో మహేశ్, భూపాలపల్లి మునిసిపల్ చైర్ పర్సన్ సెగ్గెo వెంకట రాణి, మహదేవ్ పూర్ ఎంపిపి రాణిబాయ్, ఎంపీటీసీ మమత, సర్పంచ్ వసంత, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
———————————————-
జిల్లా పౌరసంబంధాల అధికారి, జయశంకర్ భూపాలపల్లి కార్యాలయంచే జారీచేయనైనది.

Share This Post