ప్రజలందరూ మాస్కులు తప్పక ధరించాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు

                                                  ప్రజలందరూ మాస్కులు తప్పక ధరించాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు. గురువారం కలెక్టర్ చాంబర్లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్ళవద్దని కలెక్టర్ సూచించారు. ముఖ్యమైన పని నిమిత్తం వెళ్ళినప్పుడు మాస్కులు ధరించాలని ప్రభుత్వం సూచించిన నియమ నిబంధనలు తప్పక పాటించాలని కలెక్టర్ అన్నారు. జిల్లాలో ఇంటింటి ఆరోగ్యం కార్యక్రమంపై ఇంటింటి సర్వే నిర్వహించనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. సుమారుగా ఒక లక్ష గృహాలను తమ టీమ్స్ 7 రోజులలో ఇంటింటి సర్వే నిర్వహించి పూర్తి వివరాలు సేకరిస్తారని కలెక్టర్ తెలిపారు. ఇప్పటివరకు 1200 మందికి టెస్టులు చేయగా 300 యాక్టివ్ కేసులు నమోదయ్యాయని  ఎవరు అధైర్య పడవద్దని ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. వాట్సాప్ లో తప్పుడు  సందేశాలు వల్ల  ప్రజలు అపోహలకు లోనవుతున్నారని, ప్రభుత్వ సలహాలను సూచనలను పాటించాలని కలెక్టర్ అన్నారు. అందరికీ హోమ్ ఐసొల్యూషన్ కిట్స్ అందజేస్తామన్నారు వాటిని వాడుకొని,  బలమైన ఆహారం తీసుకుంటూ జాగ్రత్తగా ఉండాలని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఐసోలేషన్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని వాటిలో అన్ని సదుపాయాలు, ఆక్సిజన్ సిద్ధంగా ఉన్నాయని సిబ్బంది కూడా సిద్ధంగా ఉన్నారని కలెక్టర్ తెలిపారు. పట్టణంలో  మాస్క్ లు ధరించకుండా తిరిగే వారికి ఫైన్ వేయడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సురేందర్ రెడ్డి మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Share This Post