ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు వేంటనే పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య

జనగామ నవంబర్ : 06
ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు వేంటనే పరిష్కరించాలని
జిల్లా కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య అన్నారు.
శనివారం స్టేషన్ ఘన్పూర్ మoడలంలో చంద్రుతండ, ఇప్పగూడేం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసి గ్రామ స్థాయిలో జరుగుతున్న వ్యాక్సినేషన్, అందిస్తున్న ఇతర వైద్య సేవల గురించి సిబ్బంది హాజరు వివరాలు తెలుసుకున్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అనంతరం స్టేషన్ ఘన్పూర్ మoడల తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతున్న రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పరిశీలించారు.
ధరణి ద్వారా దరఖాస్తు చేసుకున్న దరఖాస్తులను పరిశీలించి వీలైనంత త్వరగా పరిష్కరించాలని వివిధ పనుల పై కార్యాలయాలకు వచ్చే ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో స్టేషన్ ఘన్పూర్ తహసీల్దార్ విశ్వ ప్రసాద్, కార్యాలయ సిబ్బంది ఉన్నారు.

Share This Post