ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలి….. జిల్లా కలెక్టర్ కె. శశాంక

ప్రచురణార్థం

ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలి….. జిల్లా కలెక్టర్ కె. శశాంక.

మహబూబాబాద్, మే -06:

ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక వైద్య అధికారులను ఆదేశించారు.

శుక్రవారం కలెక్టరేట్ లోని ప్రగతి సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కె. శశాంక అడిషనల్ ఎస్పీ యోగేష్ గౌతం తో కలిసి వైద్య, ఆరోగ్య శాఖ కార్యక్రమాలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, లింగ నిర్ధారణ చట్టం సమర్థవంతంగా అమలు చేయుటకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, జిల్లాలో మెడికల్ ప్రాక్టీస్ చేస్తున్న వారు రిజిస్ట్రేషన్ చేసుకున్నారా లేదా, వారికున్న అర్హతలను పరిశీలించాలని తెలిపారు.

పి.హెచ్.సి. లలో డాక్టర్ లు, ఏ.ఎన్.ఎం. లు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు తప్పనిసరి అందుబాటులో ఉండాలని, సబ్ సెంటర్, పి.హెచ్.సి లను డి.ఎం. అండ్ హెచ్. ఓ. తనిఖీలు చేయాలని, అలసత్వం ప్రదర్శించే వారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. సబ్ సెంటర్, పి.హెచ్.సి.లలో వారం రోజులపాటు 24 గంటలు అందుబాటులో ఉండే వాటిలో ప్రభుత్వ సెలవుల్లో, రాత్రి పూట విధులలో ఉన్న వారి వివరాలను గోడపై ప్రదర్శించాలని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలి అన్నారు.

ఓ.పి లలో లక్ష్యం మేరకు నమోదు కావాలని, ముల్కనురు, ఉగ్గంపల్లిలో తక్కువ ఓ.పి. ఉన్నదని, పల్లెల్లో శిబిరాలు ఏర్పాటు చేసి, ప్రచారం చేసి ప్రజలకు నమ్మకం కలిగించి సేవలను విస్తృతం చేయాలన్నారు. వచ్చిన వారి వివరాలను ఈ ఔషధీ లో నమోదు చేయాలనీ తెలిపారు. తల్లి, పిల్లల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని, కే.సి.ఆర్.పోర్టల్ లో నమోదు చేయాలనీ, సబ్ సెంటర్ వారీగా, పి.హెచ్. సిలలో రిజిస్ట్రేషన్ వంద శాతం నమోదు పై దృష్టి సారించాలని తెలిపారు. ఏ.ఎన్.ఎం., అంగన్వాడి లతో తరచుగా సమావేశం నిర్వహించాలని తెలిపారు.

ఈ సందర్భంగా ఏ.ఎం.సి రిజిస్ట్రేషన్, ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ప్రసవాలు, సాధారణ, సిజేరియన్ డెలివరిలు, ఇమ్మునిజేషన్, టి హబ్, పి.హెచ్.సి లలో సీసీ కెమెరా ల ఏర్పాటు, పల్లె దవాఖానాలు, సబ్ సెంటర్, వాక్సినేషన్, ప్రసవాలపై పి.హెచ్.సి లవారీగా జిల్లా కలెక్టర్ సమీక్షించారు.

ఏ.ఎస్పీ మాట్లాడుతూ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో సంభందిత మెడికల్ రిజిస్టర్ లు మెయింటైన్ చేయడం లేదని, ఎం.ఎల్.సి. రిపోర్ట్ లను, పోస్ట్ మార్టం నివేదిక లను వారం లోగా అందించాలని, పాయిజన్ కేసులు, డైయింగ్ డిక్లరేషన్ లను కేర్ ఫుల్ గా ఫార్మాట్ రూపంలో నమోదు చేయలని, పొస్కో చట్టం ప్రకారం నమోదు అయిన కేసులలో, రేప్ కు సంబంధించి రిపోర్ట్ లను అందించటానికి నెలల తరబడి చేస్తున్నారని, వెంటనే అందించాలని, ఏదైనా సమస్య ఉంటే సరైన సమయంలో పోలీస్ అధికారులకు సమాచారం ఇవ్వాలని, పోలీసులకు పూర్తి సహకారం అందించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ హరీష్ రాజ్, డిప్యూటీ డి.ఎం.అండ్ హెచ్. ఓ.లు డాక్టర్ అంబరీష, డాక్టర్ మురళీధర్, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ సుధీర్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ రాజేశ్, ఐ.ఎం. ఏ. ప్రెసిడెంట్, సి.హెచ్.సి. గూడూరు సూపరింటెండెంట్ డాక్టర్ వీరన్న, వైద్య అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

———————————————————-

జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, మహబూబాబాద్ చే జారీ చేయనైనది.

Share This Post