. ప్రజలకు ఉపయోగపడేందుకు చక్కటి ఆక్సిజన్ ప్లాంటు లాంటి పార్కును ఏర్పాటు చేశారని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు.

శుక్రవారం చుంచుపల్లి మండలం, త్రీ ఇంక్లేన్ గ్రామపంచాయతీలో ఏర్పాటు చేసిన బృహత్ పల్లె పకృతి వనంలో విద్యుత్ మోటారును ప్రారంభించి, పార్కులో నాటిన మొక్కలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్కు మంచి మంచి చెట్లుతో కళ కళలాడుతున్నదని సంతోషం వ్యక్తం చేశారు. పంచాయతీ టీములో సేవ చేయాలన్న సంకల్పం తపన ఉంటే అభివృద్ధి ఈ విధంగా సుసాధ్యమవుతుందని ఈ టీము నిరూపించిందని. చెప్పారు. బృహత్ ప్రకృతి వనం చాలా అద్భుతంగా అన్ని హంగులతో ఏర్పాటు చేశారని, మంచి కార్యక్రమం ఏర్పాటు. చేశారని అభినందించారు. 10 ఎకరాలలో పార్కు ఏర్పాటు చేయడం జరిగిందని, రానున్న రోజుల్లో ప్రజలకు ఆహ్లాదాన్ని అందించేందుకు ఈ పార్కు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రజలు వాకింగ్ చేయడానికి, చిన్నారులు. ఆడుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పారు. ఎంతో కష్టపడి బ్రహ్మాండమైన పార్కు ఏర్పాటు చేశారని ఉపాధి హామి పథకం కూలీలలను, సర్పంచును, కార్యదర్శిని, యంపిడ్, యంపిడిఓను, డిఆర్డిఓను, డిపిటను, మండల ప్రత్యేక అధికారి విద్యాలతను అభినందించారు. ఇదే స్పూర్తితో త్రీ ఇంక్షేన్ గ్రామ పంచాయతీ అభివృద్ధికి ఆదర్శంగా నిలవాలని చెప్పారు. విద్యుత్ మోటారు ఏర్పాటు ప్రక్రియ జరిగినందున మొక్కలకు సమృద్ధిగా నీరందించేందుకు ట్రిప్ ఏర్పాటు చేయాలని ఆయన పేర్కొన్నారు. పార్కుకు నీటి సమస్య లేదని, మొక్కలను ఈ మూడు నెలల అత్యంత జాగ్రత్తగా కాపాడుకోవాలని చెప్పారు. ఈ ప్రాంతానికి దట్టమైన అడవిని తయారవుతున్నందుకు చాలా సంతోషంగా ఉన్నదని చెప్పారు. ఈ ప్రాంత ప్రజలు ఆహ్లాదం కొరకు, బంధు మిత్రులతో సంతోషంగా వన భోజనాలు చేసేందుకు. ప్రశాంతమైన వాతావరణంలో సేపు సేద తీరడానికి ఉపయోగపడుతుందని చెప్పారు. పకృతి వనాన్ని ప్రజలు వినియోగించుకునేందుకు వీలుగా తెలుసుకోవడానికి ప్రధాన రహదారితో పాటు పార్కు ముందర బోర్డులు ఏర్పాటు చేయాలని చెప్పారు. అనంతరం త్రీ ఇంక్లేన్ పంచాయతీలో వ్యాక్సినేషన్ ప్రక్రియ గురించి వైద్యాధికారిని, ఆశాలను, ఏయన్యంలను అడిగి తెలుసుకున్నారు. పంచాయతీలో నూరు శాతం వ్యాక్సిన్ పూర్తి చేయడం పట్ల ఆయన ఆశాలను, ఏయనాంలను వైద్యాధికారి డాక్టర్ వెంకన్నతో పాటు భాగస్వాములైన ప్రతి ఒక్కరినీ ప్రత్యేకంగా అభినందించారు. ఇదే స్పూర్తితో రెండవ విడత డోస్ కూడా కొనసాగించాలని పూర్తి చేయాలని చెప్పారు. అనంతరం పార్కులో భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అంగోత్ గాతి, ఉప సర్పంచ్ ఈశ్వర్, జడ్పీ సీఈఓ విద్యాలత, డిపిఓ రమాకాంత్, డిఆర్డిఓ మధుసూదన్ రాజు, యంపిడిఓ రమేష్, యంపిఓ సత్యనారాయణ, వైద్యాధికారి డాక్టర్ వెంకన్న, కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

Share This Post