ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కృషి:: రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు

ప్రచురణార్థం—3

తేదీ.2.5.2022

ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కృషి:: రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు

జగిత్యాల మే 2:- ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా మెరుగైన వైద్యసేవలు అందించే దిశగా కృషి చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ పనితీరుపై ఆయన సోమవారం జిల్లా కలెక్టర్లు సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రివ్యూ నిర్వహించారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ
ముఖ్య‌మంత్రి కేసీఆర్ గారు విద్య, వైద్యారోగ్య రంగాలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారని, గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా ఈసారి అరోగ్య రంగానికి బ‌డ్జెట్‌లో రూ. 11,440 కోట్లు కేటాయించారని తెలిపారు.
దేశంలో అరోగ్య రంగంలో తెలంగాణ 3 స్థానంలో ఉందని నెంబర్ 1 స్థానం చేరేందుకు అందరం కలిసి కృషి చేయాలని మంత్రి సూచించారు.

తెలంగాణ ఏర్పాటు తర్వాత వైద్యారోగ్య సేవలు విస్తృతం అయ్యాయని, క్షేత్ర స్థాయిలో నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయని మరింత మెరుగ్గా ఈ సేవలు ప్రజలకు అందించేందుకు మానిటరింగ్ పెంచాలని కలెక్టర్ లకు మంత్రి సూచించారు. 99 శాతం బాగా పని చేసినా ఒక్క నిర్లక్ష్యం చెడ్డ పేరు తెస్తుంది. అలా జరగకుండా చూడాలి.

ముఖ్యమంత్రి గారి ఆలోచనతో దేశంలోనే టి -డయాగ్నొస్టిక్స్ పేరిట అద్భుతమైన రోగ నిర్ధారణ సేవలు అందిస్తున్నామని, 57 రకాల పరీక్షలు ఉచితంగా చేస్తున్నామని, దీనిపై దృష్టి ఈ సారి మరింత విస్తృతంగా వినియోగించాలని మంత్రి ఆదేశించారు. అరోగ్య శ్రీ సేవలు ప్రజలకు అందేలా చూడాలని, ప్రభుత్వ ఆసుపత్రులలో ఎక్కువ ఆరోగ్య శ్రీ కేసులు చేయడం వల్ల పేదలకు ఉచిత వైద్యం అందటంతో పాటు ఆసుపత్రులు బలోపేతం అవుతాయని మంత్రి అన్నారు.

108, 102 అమ్మ ఒడి అంబులెన్స్ సేవలు, అలనా వాహనాల పనితీరును కలెక్టర్ రివ్యూ చేయాలని ఆసుపత్రులను ఆకస్మిక తనిఖీ చేయాలని, అక్కడి పరిస్థితులను తెల్సుకోవాలని మంత్రి సూచించారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు లేరు అనే మాట రావద్దని, ముఖ్యమంత్రి గారు ఎక్కడా ఖాళీ లేకుండా భర్తీ చేయాలని సూచించారని తెలిపారు.

ప్రతి పి హెచ్ సి లో డాక్టర్ ఉండేవిధంగా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని, ఖాళీగా ఉన్న చోట వాక్ ఇంటర్వ్యూ లో పెట్టీ అపాయింట్ చేయాలని, లేదా ఆర్.బి.ఎస్.కె వైద్యులను నియమించాలని సూచించారు.
అమ్మ ఒడి 102 వాహనాల ద్వారా గర్భిణులకు సేవలు అందించాలని, ఏ ఎన్ ఎం పరిక్షలు 3 సార్లు చేయించాలని మంత్రి తెలిపారు.

జిల్లాలో ముఖ్యంగా సి సెక్షన్లు తగ్గించడంలో ప్రభుత్వం దృష్టి సారించాలని, కలెక్టర్లు ఆ దిశగా చర్యలు తీసుకోవాలని మంత్రి పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్లు ప్రభుత్వ, ప్రైవేటు సెక్షన్ల పై ఆడిట్ చేయాలని, తల్లి పిల్లకు నష్టం అనుకున్నపుడు మాత్రమే సెక్షన్ చేయాలని, ఈ విషయంలో పెద్ద మొత్తంలో అవగాహన కల్పించాలని మంత్రి ఆదేశించారు.

అనవసరంగా సీజెరియన్ చేయడం వల్ల తల్లి, బిడ్డకు నష్టం. తల్లి, పిల్ల ఆరోగ్యం బాగుండాలంటే సి సెక్షన్లు తగ్గాలి. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో తగ్గేలా చర్యలు తీసుకోవాలి.

ఏఎన్సి చెకప్స్ సక్రమంగా నిర్వహించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. మాతా శిశు మరణాలు తగ్గించడం సాధ్యమవుతుంది.

కేసీఆర్ కిట్స్ పథకం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు 30 నుండి 56 శాతానికి పెరిగింది. ఇది మరింత పెరిగేలా కృషి చేయాలి. వంద శాతం ఇన్స్టిట్యూషన్ డెలివరీలు జరిగేలా చూడాలి.
ఎన్ సి డి స్క్రీనింగ్ పకడ్బందీగా జరిగేలా చూడాలి. డేటా ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేయాలి. టీబీ ఫ్రీ స్టేట్ అయ్యేందుకు మనం దగ్గర్లో ఉన్నాము. ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. ఇటీవల మలేరియా నియంత్రణకు గాను తెలంగాణకు కేంద్రం నుండి అవార్డు వచ్చింది. ఈ విషయంలో కేటగిరీ 2 నుండి 1 కి వచ్చాము.

ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ.. ఆసుపత్రులకు కాయకల్ప, లక్ష్య, క్వాలిటీ అసురెన్స్ సర్టిఫికెట్స్ వచ్చేలా చూడాలి.

ఆసుపత్రుల్లో పారిశుద్ధ్యం, డైట్ సేవలను సమీక్షించాలని,బడ్జెట్ లో చార్జీలను పెంచడం జరిగింది. పాత టెండర్ల గడువు పూర్తి అయిపోయింది. వెంటనే శానిటేషన్, డైట్ టెండర్లు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.

636 పీహెచ్ సి 232 అర్బన్ పి హెచ్ సి లో సి సి కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం అని ఇవి పూర్తి అయితే జిల్లా కలెక్టర్లు సైతం పరిశీలించే వెసులుబాటు ఉంటుందని తెలిపారు.

రాష్ట్రంలో 18 ఏళ్లు పై బడిన వారికి,15-17 ఏళ్ల కేటగిరీ,12- 14 ఏళ్ల కేటగిరీలో వంద శాతం కొవిడ్ వాక్సినేషన్ పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలి. ప్రతి రోజు కోవిడ్ పరీక్షలు చేయాలి.

వడ గాలుల విషయంలో ప్రజల్ని అప్రమత్తం చేయాలని,ఆసుపత్రుల్లో తాగునీటి వసతులు ఉండేలా చూడాలి అన్నారు.

సిఎస్ సోమేష్ కుమార్ మాట్లాడుతూ..
ముఖ్యమంత్రి గారు వైద్య రంగాన్ని పటిష్టం చేయాలని చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో అవసరమైన నిధులు అందిస్తున్నారు. నెలలో ఏదో ఒక రోజు కలెక్టర్లు వైద్యారోగ్యం పై పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించాలి. ఎక్కడికి వెళ్ళినా సమీపంలోని ఆసుపత్రులను సర్ప్రైజ్ విజిట్ చేయాలి.

జిల్లా కలెక్టర్ జి.రవి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ , సంబంధించిన అధికారులు తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి జగిత్యాల చే జారీ చేయనైనది.

ప్రచురణార్థం---3  తేదీ.2.5.2022  ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కృషి:: రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు  జగిత్యాల మే 2:- ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా మెరుగైన వైద్యసేవలు అందించే దిశగా కృషి చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ పనితీరుపై ఆయన సోమవారం జిల్లా కలెక్టర్లు సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రివ్యూ నిర్వహించారు.  ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గారు విద్య, వైద్యారోగ్య రంగాలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారని,  గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా ఈసారి అరోగ్య రంగానికి బ‌డ్జెట్‌లో రూ. 11,440 కోట్లు కేటాయించారని తెలిపారు.  దేశంలో అరోగ్య రంగంలో తెలంగాణ 3 స్థానంలో ఉందని నెంబర్ 1  స్థానం చేరేందుకు అందరం కలిసి కృషి చేయాలని మంత్రి సూచించారు.  తెలంగాణ ఏర్పాటు తర్వాత వైద్యారోగ్య సేవలు విస్తృతం అయ్యాయని,  క్షేత్ర స్థాయిలో నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయని మరింత మెరుగ్గా ఈ సేవలు ప్రజలకు అందించేందుకు మానిటరింగ్ పెంచాలని కలెక్టర్ లకు మంత్రి సూచించారు. 99 శాతం బాగా పని చేసినా ఒక్క నిర్లక్ష్యం చెడ్డ పేరు తెస్తుంది. అలా జరగకుండా చూడాలి.    ముఖ్యమంత్రి గారి ఆలోచనతో దేశంలోనే టి -డయాగ్నొస్టిక్స్ పేరిట అద్భుతమైన రోగ నిర్ధారణ సేవలు అందిస్తున్నామని, 57 రకాల పరీక్షలు ఉచితంగా చేస్తున్నామని,  దీనిపై దృష్టి ఈ సారి మరింత విస్తృతంగా వినియోగించాలని మంత్రి ఆదేశించారు.  అరోగ్య శ్రీ సేవలు ప్రజలకు అందేలా చూడాలని, ప్రభుత్వ ఆసుపత్రులలో ఎక్కువ ఆరోగ్య శ్రీ కేసులు చేయడం వల్ల పేదలకు ఉచిత వైద్యం అందటంతో పాటు ఆసుపత్రులు బలోపేతం అవుతాయని మంత్రి అన్నారు.   108, 102 అమ్మ ఒడి అంబులెన్స్ సేవలు, అలనా వాహనాల పనితీరును కలెక్టర్ రివ్యూ చేయాలని  ఆసుపత్రులను ఆకస్మిక తనిఖీ చేయాలని, అక్కడి పరిస్థితులను తెల్సుకోవాలని మంత్రి సూచించారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు లేరు అనే మాట రావద్దని,  ముఖ్యమంత్రి గారు ఎక్కడా ఖాళీ లేకుండా భర్తీ చేయాలని సూచించారని తెలిపారు.   ప్రతి పి హెచ్ సి లో డాక్టర్ ఉండేవిధంగా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని, ఖాళీగా ఉన్న చోట  వాక్ ఇంటర్వ్యూ లో పెట్టీ అపాయింట్ చేయాలని, లేదా ఆర్.బి.ఎస్.కె వైద్యులను నియమించాలని సూచించారు. అమ్మ ఒడి 102 వాహనాల ద్వారా గర్భిణులకు సేవలు అందించాలని, ఏ ఎన్ ఎం పరిక్షలు 3 సార్లు  చేయించాలని మంత్రి తెలిపారు.  జిల్లాలో ముఖ్యంగా సి సెక్షన్లు తగ్గించడంలో ప్రభుత్వం దృష్టి సారించాలని, కలెక్టర్లు ఆ దిశగా చర్యలు తీసుకోవాలని మంత్రి పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్లు ప్రభుత్వ, ప్రైవేటు సెక్షన్ల పై ఆడిట్ చేయాలని, తల్లి పిల్లకు నష్టం అనుకున్నపుడు మాత్రమే సెక్షన్ చేయాలని, ఈ విషయంలో పెద్ద మొత్తంలో అవగాహన కల్పించాలని మంత్రి ఆదేశించారు.  అనవసరంగా సీజెరియన్  చేయడం వల్ల తల్లి, బిడ్డకు నష్టం. తల్లి, పిల్ల ఆరోగ్యం బాగుండాలంటే సి సెక్షన్లు తగ్గాలి. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో తగ్గేలా చర్యలు తీసుకోవాలి.   ఏఎన్సి చెకప్స్ సక్రమంగా నిర్వహించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. మాతా శిశు మరణాలు తగ్గించడం సాధ్యమవుతుంది.  కేసీఆర్ కిట్స్ పథకం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు 30 నుండి 56 శాతానికి పెరిగింది. ఇది మరింత పెరిగేలా కృషి చేయాలి. వంద శాతం ఇన్స్టిట్యూషన్ డెలివరీలు జరిగేలా చూడాలి.  ఎన్ సి డి స్క్రీనింగ్ పకడ్బందీగా జరిగేలా చూడాలి. డేటా ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేయాలి. టీబీ ఫ్రీ స్టేట్ అయ్యేందుకు మనం దగ్గర్లో ఉన్నాము. ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. ఇటీవల మలేరియా నియంత్రణకు గాను తెలంగాణకు కేంద్రం నుండి అవార్డు వచ్చింది. ఈ విషయంలో కేటగిరీ 2 నుండి 1 కి వచ్చాము.  ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ.. ఆసుపత్రులకు కాయకల్ప, లక్ష్య, క్వాలిటీ అసురెన్స్ సర్టిఫికెట్స్ వచ్చేలా చూడాలి.   ఆసుపత్రుల్లో పారిశుద్ధ్యం, డైట్ సేవలను సమీక్షించాలని,బడ్జెట్ లో చార్జీలను పెంచడం జరిగింది. పాత టెండర్ల గడువు పూర్తి అయిపోయింది. వెంటనే శానిటేషన్, డైట్ టెండర్లు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.   636 పీహెచ్ సి 232 అర్బన్ పి హెచ్ సి లో సి సి కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం అని ఇవి పూర్తి అయితే జిల్లా కలెక్టర్లు సైతం పరిశీలించే వెసులుబాటు ఉంటుందని తెలిపారు.   రాష్ట్రంలో 18 ఏళ్లు పై బడిన వారికి,15-17 ఏళ్ల కేటగిరీ,12- 14 ఏళ్ల కేటగిరీలో వంద శాతం కొవిడ్ వాక్సినేషన్ పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలి. ప్రతి రోజు కోవిడ్ పరీక్షలు చేయాలి.  వడ గాలుల విషయంలో ప్రజల్ని అప్రమత్తం చేయాలని,ఆసుపత్రుల్లో తాగునీటి వసతులు ఉండేలా చూడాలి అన్నారు.    సిఎస్ సోమేష్ కుమార్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి గారు వైద్య రంగాన్ని పటిష్టం చేయాలని చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో అవసరమైన నిధులు అందిస్తున్నారు. నెలలో ఏదో ఒక రోజు కలెక్టర్లు వైద్యారోగ్యం పై పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించాలి. ఎక్కడికి వెళ్ళినా సమీపంలోని ఆసుపత్రులను సర్ప్రైజ్ విజిట్ చేయాలి.     జిల్లా కలెక్టర్ జి.రవి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ , సంబంధించిన అధికారులు తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.   జిల్లా పౌర సంబంధాల అధికారి జగిత్యాల చే జారీ చేయనైనది.
ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కృషి:: రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు

Share This Post