ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి

ప్రచురణార్థం..1 తేదిః 17-11-2021
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి
 ప్రతిరోజు 150 ఓపి జరిగేలా చూడాలి.
 వందశాంత ఇమ్యూనైజేషన్ వ్యాక్సిన్లు రోగ నిరోధక టీకాలు అందించాలి
 ఖాళీ పోస్టుల భర్తి కై తగు చర్యలు తీసుకోవాలి.
 ప్రతి ప్రభుత్వ ఆసుపత్రి వారిగా హస్పిటల్ డెవలప్ మెంట్ కమీటి సమావేశాలు నిర్వహించాలి
 ఆసుపత్రుల్లో వైద్య పరికరాలు వినియోగంలో ఉండాలి.
 సమయ పాలన పాటించాలి
 కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతంగా పూర్తిచేయాలి.
జగిత్యాల, నవంబర్ 17: జిల్లాలో ప్రతి ప్రభుత్వ ఆసుపత్రి నందు ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాలని జిల్లా కలెక్టర్ జి. రవి వైద్య అధికారులను ఆదేశించారు. బుదవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు, కోవిడ్ వ్యాకసినేషన్ పై జూమ్ వెబ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని ప్రాథమిక ఆసుపత్రి మొదలుకొని జిల్లా ఆసుపత్రి వరకు జరిగే ప్రసవాలకు సమానంగా పుట్టిన పిల్లలకు బిసిజి టీకాలను అందించాలని, పుట్టిన పిల్లలలో 6వ నెల నుండి4వారాల తేడాతో పెంటా 1,2 మరియు 3 వ్యాక్సిన్ లను వ్యాక్సినేషన్ లు అందించాలని మరియు రోటా వైరస్, పోలియో చుక్కల మందును అందించాలని, 9 నెలుల నుండి దాటిన తరువాత ఫుల్ ఇమ్యూనైజెషన్, 10 నెలల నుండి 12 నెలల లోపు యం.ఆర్, జెఈ వ్యాక్సిన్ లను అందించాలని పేర్కోన్నారు. పెండింగ్ లో ఉన్న వ్యాక్సిన్ లను శనివారంలోగా వందశాతం పూర్తిచేసి ఉండాలని ఆదేశించారు.
వైద్యశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులకు, రాజినామా చేసిన వారి వివరాలను పంపించి, ఖాళీ అయిన పోస్టులలో జిల్లా స్థాయిలో చేసే వాటికి జిల్లా కలెక్టర్ గారి అనుమతి ద్వారా భర్తి చేయాలని, ఆ పై పోస్టులకు ప్రభుత్వానికి నివేధికను పంపించాలని సూచించారు. ప్రతి హస్పటల్ వారిగా డెవలపే మెంట్ కమీటి సమావేశాలను సకాలంలోప్రతి మూడు మాసాలకు ఒకసారి నిర్వహించాలని, మెరుగైన వైద్య సేవల నిమిత్తం ఆసుపత్రులకు జారిచేసిన ప్రతి ఎక్విప్ మెంట్ వినియోగంలోకి తీసుకురావాలని, ఎవైన సాంకేతిక ఇబ్బందులు తలెత్తినట్లయితే వెంటనే జిల్లా వైద్యాధికారికి తెలియ పరచాలని ఆదేశించారు.
టిహబ్ ద్వారా ప్రతిరోజు వివిధ ఆసుపత్రుల ద్వారా వైద్య పరీక్షల నిమిత్తం వచ్చే రిపోర్టులు ఎప్పుడు ఇస్తున్నారని పరిశీలించాలని, గత నెల నుండి ఎన్ని సాంపుల్స్ సేకరించడం జరిగింది, వాటి రిపోర్టులు ఎంత సమయం తరువాత అందించారన్న నివేధికను సమర్పించాలని అన్నారు. సూపరింటెండెంట్లు ప్రతిరోజు డాక్టర్, ఎఎన్ఏం, ఆశా వారి ప్రగతిని పరిశీలించడంతో పాటు ప్రతిరోజు 150 ఓపి జరిగేలా చూడాలని పేర్కోన్నారు. వైద్యుల పనితీరుపై ఆకస్మీక తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని, క్షేత్రస్థాయి పర్యటనలు, సెలవులపై వెల్లినప్పడు మూవ్ మెంట్ రిజీష్టరులో నమోదు చేయాలని, ఆరోగ్య శ్రీ సేవల ద్వారా వచ్చే నిధులను ఆసుపత్రి అభివృద్దికి కేటాయించాలని తెలియజేశారు.

ఆరోగ్యశ్రీ ఆసుపత్రులలో బెడ్ కెపాసిటి వివరాలు తనిఖీ చేయాలని, సానిటేషన్ సక్రమంగా జరగాలని, పరిశుభ్రమైన పౌష్టిక ఆహారం అందజేయాలని, ఆసుపత్రులలో ఎజేన్సి ప్రకారం నియమించిన లేబర్ ల పనితీరును సమీక్షించుకోవాలని, జిల్లా వైద్యాధికారి సైతం పిహెచ్సీలలో తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రతిరోజు వ్యాక్సినేషన్ ప్రక్రియను సెంటర్, సబ్ సెంటర్ వారిగా వేగవంతంగా పూర్తిచేయడంలో కీలకంగా వ్యవహరించాలని సూచించారు. అశా, ఎఎన్ఎం ద్వారా క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తూ, వ్యాక్సినేషన్ పెండింగ్ లేకుండా లక్ష్యాలను తెలుసుకోవాలని అన్నారు.
జిల్లాలో మైగ్రెటెడ్ లేబర్ లకు, 18 సంవత్సరాలు నిండి ఓటరుగా నమోదు కాని వారిని గుర్తించి వారికి వ్యాక్సిన్ అందించేలా చూడాలని పేర్కోన్నారు. వ్యాక్సినేషన్ అవసరం ఉన్నచోట, ఎక్కువ టీంలను పంపించాలని. వ్యాక్సిన్ ఎక్కడ వేస్తున్నారో సామాన్యులకు సైతం తెలిసేలా చూడాలని, అవసరమైతే ఇంటింటి సర్వే వెళ్లినప్పుడు కూడా వ్యాక్సిన్ అందించేలా చూడలాని పేర్కోన్నారు. అధికారులు కేటాయించిన ప్రదేశంలో అందుబాటులో ఉండి, వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని, ఉదయం 09:00 గంటలకు వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కావాలని ఆదేశించారు.

జిల్లా వైద్యాధికారి, మెడికల్ సూపరింటెండెంట్లు, ప్రోగ్రాం ఆఫీసర్లు, మెడికల్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి

జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, జగిత్యాల చే జారిచేయనైనది.

Share This Post