ప్రజలకు విద్య, వైద్యం సమపాళ్ళలో అందించి సమాజ శ్రేయస్సు కోసం పాటుపడాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి అధికారులను ఆదేశించారు

ప్రజలకు విద్య, వైద్యం సమపాళ్ళలో అందించి
సమాజ శ్రేయస్సు కోసం పాటుపడాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి అధికారులను ఆదేశించారు
శనివారం రోజున వరంగల్ జిల్లాలో విస్తృతంగా పర్యటించారు ఉర్సు మెటర్నిటీ హాస్పిటల్ రంగ సాయి పేట ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ సెంటర్ వరంగల్ ఆరేపల్లి లో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడపబడుతున్న గ్రూప్స్ ప్రిపరేషన్ ఫ్రీ కోచింగ్ సెంటర్ ను పరిశీలించారు.
ముందుగా ఉర్సు మెటర్నటీ ఆసుపత్రిని పరిశీలించి పూర్తిస్థాయిలో డాక్టర్లు అందుబాటులో ఉంచుకుని మెటర్నటీ ఆస్పత్రిని నడిపించాలని మందులు అందుబాటులో ఉంచుకోవాలని ఏమైనా ఇబ్బందులు ఉంటే తనకు తెలియజేయాలని తెలిపారు అనంతరం రంగ సాయి పేట గ్రామంలో ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ సెంటర్ ను పరిశీలించారు వరంగల్ జిల్లాలో 22 ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ లో 4,999 అభ్యర్థులు పరీక్షలు రాస్తున్నారని అన్నారు ప్రతి సెంటర్ ను కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణలో గట్టి నిఘా ఏర్పాటు చేసి పగడ్బందీగా పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు రంగ సాయి పేట ఇంటర్మీడిట్ సెంటర్లో 332మంది పరీక్షలు రాయాల్సి ఉండగా 20 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కాలేదని 312 మంది విద్యార్థులు మాత్రమే పరీక్షలు రాశారని తెలిపారు
వరంగల్ ఆరేపల్లి నందు గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గ్రూప్స్ ప్రిపరేషన్ అయ్యే అభ్యర్థులకు ఫ్రీ కోచింగ్ సెంటర్ ను పరిశీలించారు గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుపబడుచున్న కోచింగ్ సెంటర్ లో శిక్షణ వినియోగించుకుని ఉద్యోగాలు పొందాలని అభ్యర్థులకు సూచించారు
ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకట రమణ సీకేఎం సూపరిండెంట్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి జహీరుద్దీన్ ఆర్ యం ఒ జె శ్యామ్ కుమార్ సంబంధిత కార్పొరేటర్లు పాల్గొన్నారు

Share This Post