ప్రజలనుండి వివిధ సమస్యల పై ధరకాస్తు స్వీకరించిన జిల్లా కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య

వార్త ప్రచురణ
తేదీ.27.12.2021.
ములుగు జిల్లా,( వెంకటాపురం)

జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజల ప్రయోజనాల నిమిత్తం ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోనీ మహిళ స్త్రీ శక్తి కేంద్రం లో నిర్వహించారు.

సోమవారం రోజున జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య పాల్గొని ప్రజలనుండి వివిధ సమస్యల పై ధరకాస్తు స్వీకరించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల వద్దకు వారి సమస్యలను పరిష్కరించడం మే లక్ష్యంగా ప్రజావాణి నిర్వహించడం జరుగుతుందని, గత ప్రజావాణి పెండింగ్ ధరకాస్తు గల కారణాలను జిల్లా అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజావాణి ధరకాస్తు పెండింగ్లో ఉండరాదని జిల్లా అధికారులను ఆదేశించారు.
వెంకటాపురం పరిది లో నీటి సౌలభ్యం ఉన్న ప్రాంతాలలో త్రాగు నీటి కొరత ఉండరాదని, ఆర్ డబ్లు ఎస్ అధికారిని ఆదేశించారు.

వివిధ శాఖల అధికారుల తో మాట్లాడుతూ శాఖ పరమైన దరఖాస్తులు పెండింగ్ వివరాలు అడిగి తెలుసుకుని అందుకు కారణాలని ధరకాస్తు దారులకి తెలియజేయాలని అన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆన్లైన్ అటెండెన్స్ తప్పని సరి అన్నారు.
పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలని, హాస్టల్స్ లో ఈవెనింగ్ స్నాక్స్ అందించాలని అన్నారు.
కమ్యూనిటీ టాయిలెట్స్, సోక్ ఫీట్స్ , సమ్ మామ్ చిల్డ్రన్ ను గుర్తించి పౌష్ఠిక ఆహరం అంచించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు అన్నారు.

ఈ సందర్భంగా ఆర్ అండ్ బి ఇఇ గారితో మాట్లాడుతూ పాలం పేట, శాపెల్లి రోడ్లను త్వరిత గతిన పూర్తి చేయాలని అన్నారు.

ఈ రోజు ప్రజావాణి లో 175 ధరకాస్తు వచ్చాయి. ఎక్కువగా డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి ,పట్టా భూముల పైన ఎక్కువగా దరఖాస్తులు వచ్చాయి. వాటిని సంబంధిత శాఖల అధికారులకు పరిష్కారం నిమిత్తం ఎండార్స్ సంబంధిత శాఖల అధికారులకు అందించారు.

ప్రజావాణి కార్యక్రమం వెంకటాపురంలో ఏర్పాటు చేసినందుకు
ప్రజల స్పందన కోరగా ప్రజలు ఎంతో సంతోషంగా ఉందని జిల్లా కలెక్టర్ గారు మా సమస్యల పరిష్కారానికి
సుదూర ప్రాంతమైన వెంకటా పురం మండల కేంద్రంలో ప్రజావాణి నిర్వహించడం, ప్రజల సమస్యలను స్వయంగా కలెక్టర్ అడిగి తెలుసుకోవడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠీ, డి ఆర్వో రమాదేవి, ఐ టీ డీ ఏ ఎపి ఓ వసంత రావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడి రవి, ఆర్ అండ్ బి. ఇఇ వెంకట్, ఐ సి డి ఎస్ అధికారిణి ప్రేమలత, ఎస్సి వెల్ఫేర్ ఆఫీసర్ పి భాగ్యలక్ష్మి, డి యం &హెచ్ ఓ అప్పయ్య, తహశీలదార్ నాగరాజు,ఎంపిడిఓ ఫణి, ఎల్ డి యం ఆంజనేయులు, సంబంధిత జిల్లా అధికారులు ఐటీడీఏ యూనిట్ అధికారులు పాల్గొన్నారు.

Share This Post