ప్రజలను కోవిడ్-19 నుండి సంపూర్ణ రక్షణ కల్పించేందుకు “వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ ను” మరింత ముమ్మరం చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అధికారులను ఆదేశించారు.

ప్రచురణార్ధం

అక్టోబరు 11,ఖమ్మం:

ప్రజలను కోవిడ్-19 నుండి సంపూర్ణ రక్షణ కల్పించేందుకు “వ్యాక్సినేషన్ స్పెషల్  డ్రైవ్ ను ” మరింత ముమ్మరం చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లాలో జరుగుతున్న కోవిడ్-19 “వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్” పై కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలో ఇప్పటివరకు 150 గ్రామ పంచాయితీలలో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్నామని, భవిష్యత్తులో కోవిడ్-19 నుండి ప్రజలను రక్షించుకునేందుకు వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని ప్రజలకు మరింత అవగాహన కల్పించి ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా టీకా వేయించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖాధికారులతో పాటు మండల ప్రత్యేక అధికారులు వ్యాక్సినేషన్ శిభిరాలను తణిఖీ చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించి చైతన్య పర్చాలని కలెక్టర్ సూచించారు. ప్రస్తుతం పండుగల నేపథ్యంలో ప్రజల సమూహాలు ఎక్కువగా ఉంటాయని, కోవిడ్-19 విస్తరించకుండా ఉండేందుకు టీకా ఒక్కటే మార్గమనే విషయాన్ని ప్రజలకు తెలియజేసి ఇంకనూ టీకా తీసుకోని వారందరికి తప్పనిసరిగా వ్యాక్సినేషన్ వేయించి ఖమ్మం జిల్లాను వందశాతం వాక్సినేషన్ పూర్తి చేసుకున్న జిల్లాగా నిలపాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థతో పాటు జిల్లాలోని మూడు మున్సిపాలిటీల పరిధిలో, గ్రామీణ ప్రాంతాలలో ఇంకనూ మిగిలిన వారందరికి టీకా వేసేందుకు స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వాములు చేయాలని కలెక్టర్ తెలిపారు.

అదనపు కలెక్టర్లు స్నేహలత మొగిలి, ఎన్.మధుసూథన్, నగరపాలక సంస్థ కమీషనర్ ఆదర్శ్ సురభి, శిక్షణ కలెక్టర్ బి. రాహుల్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

Share This Post