ప్రజలలో సరైన ఆర్థిక వ్యవహారాల నిర్వహణ విషయమై అవగాహన కల్పించేందుకుగాను ఈనెల 12 నుండి ఫైనాన్షియల్ లిట్రసి వీక్ ను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి. రవి నాయక్ తెలిపారు.
ఫైనాన్షియల్ లిటరసీ వీక్ పై రూపొందించిన గోడపత్రికను ఆయన సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఆవిష్కరించారు. అంతేకాక ఆర్థిక వ్యవహారాల నిర్వహణపై ఆర్బిఐ రూపొందించిన షార్ట్ ఫిలిమ్ ను కూడా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలలో ఆర్థిక నిర్వహణ పట్ల అవగాహన కల్పించినట్లయితే వారి రోజువారి ఆర్థిక వ్యవహారాలతో పాటు, భవిష్యత్తు ఆర్థిక ప్రణాళికలు పటిష్టంగా ఉంటాయని తెలిపారు .ఇందులో భాగంగానే ఆర్బిఐ దేశవ్యాప్తంగా సరైన ఆర్థిక వ్యవహారాల నిర్వహణ విషయమై లిటరసీ వీక్ పేరుతో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ విషయమై జిల్లా కేంద్రంలో ఆదివారం 2 కె వాక్ సైతం నిర్వహించడం జరిగిందని తెలిపారు. జిల్లా ప్రజలు లిటరసీ వీక్ ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
స్థానిక సంస్థలు,రెవెన్యూ అదనపు కలెక్టర్ కె .సీతారామారావు,ఎల్ డి ఎం
కే .భాస్కర్ ,ఆర్డిఓ అనిల్ కుమార్ ,స్పెషల్ కలెక్టర్ పద్మశ్రీ ,డి ఆర్ డి ఓ యాదయ్య, జెడ్పిసిఈ ఓ జ్యోతి, బ్యాంక్ అధికారులు, జిల్లా అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.