ప్రజలు పండుగలను భక్తి శ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో శాంతి యుతంగా జరుపుకోవాలి:జిల్లా కలెక్టర్ టి.వినయ్ క్రిష్ణా రెడ్డి*

ప్రజలు పండుగలను భక్తి శ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో శాంతి యుతంగా జరుపుకోవాలి:జిల్లా కలెక్టర్ టి.వినయ్ క్రిష్ణా రెడ్డి*

ప్రజలందరూ  మత సామరస్యం పాటిస్తూ  శాంతి యుతంగా,ప్రశాంత వాతావరణంలో,భక్తి శ్రద్ధలతో సంతోషంగా జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ టి.వినయ్ క్రిష్ణా రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్  కార్యాలయ సమావేశ మందిరంలో ఈనెల 23 రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా,మార్చి 30 న శ్రీ రామ నవమి,ఏప్రిల్ 6 న హనుమాన్ జయంతి,ఏప్రిల్ 7 న గుడ్ ఫ్రైడే,ఏప్రిల్ 9 న ఈస్టర్ పండుగల సందర్భంగా ఎస్.పి.అపూర్వ రావు,
అదనపు కలెక్టర్ లు ఖుష్బూ గుప్తా,భాస్కర్ రావు లతో   కలిసి   శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రంజాన్ మాసం,శ్రీ రామ నవమి,హనుమాన్ జయంతి ఇతర  పండుగలను  శాంతియుత, ప్రశాంత వాతావరణంలో ప్రజలందరూ కలిసి పండుగ జరుపుకునే విధంగా సహకరించాలని,శాంతి కమిటీ సభ్యులు చేసిన సలహాలు సూచనలు అనుసరించి పండుగల సందర్భంగా జిల్లా యంత్రాంగం వివిధ శాఖల ద్వారా అవసరమైన ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. మసీదుల వద్ద  పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని,త్రాగు నీటి ఏర్పాటు,ఈద్గా,మసీదులు, ఖబరిస్తాన్ ల  వద్ద పిచ్చి మొక్కలు, పొదలు,అడ్డుగా ఉన్న చెట్లు కొమ్మలు తొలగించాలని,వీధి కుక్కలు,పందుల బెడద నియంత్రించి పట్టణం శివారుకు తరలించాలని మున్సిపల్ కమిషనర్ లను ఆదేశించారు..పండుగలు  షభీమ్ సందర్భంగా నిరంతర విద్యుత్ సరఫరా చేసేలా  విద్యుత్ సరఫరాపై ప్రత్యేక పర్యవేక్షణ నిర్వహించాలని ఎస్.పి.డి.సి.ఎల్ డి. ఈ ని ఆదేశించారు.రంజాన్ మాసం సందర్భంగా చౌక ధరల దుకాణాల ద్వారా ఉచిత బియ్యం,గ్యాస్ సరఫరా ఇబ్బంది లేకుండా చూడాలని జిల్లా పౌర సరఫరాల అధికారిని ఆదేశించారు.చక్కెర సరపరా చేయాలని పలువురు ముస్లిం మత పెద్దలు కోరగా ప్రభుత్వం కు నివేదిస్తు లేఖ రాస్తామని తెలిపారు.పట్టణం లో మసీదులు,ఈద్గా వద్ద కు వెళ్ళే రహదారులు,శ్రీ రామ నవమి,
హనుమాన్ జయంతి పండుగలు వున్నందున పట్టణ రోడ్ల అభివృద్ధి దృష్ట్యా ప్యాచ్ వర్క్ త్వరగా పూర్తి చేయాలని,గుంతలు పూడ్చి వేయాలని శాంతి కమిటీ సభ్యులు గోలి మధుసూధన్ రెడ్డి,పలువురు సభ్యులు కోరగా రహదారులు రిపేర్ ,ప్యాచ్ వర్క్ పూర్తి అర్&బి శాఖ ఈ ఈ.,మున్సిపల్ కమిషనర్ కి కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
ఈద్గా వెనుక ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం చేయాలని,ఈద్గా లోపల  మట్టి రోడ్డు బి.టి.రోడ్ గా మార్చాలని సభ్యులు హఫీజ్ ఖాన్ కోరగా బి.టి.రోడ్డు వేయాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. అమృత్ 2 లో బాగంగా నిర్మిస్తున్న 13 ఓవర్ హెడ్  ట్యాంక్ లలో ఈద్గా వెనుక భాగం లో నిర్మాణం చేయనున్నట్లు నల్గొండ మున్సిపల్ కమిషనర్ తెలిపారు.
పట్టణం లో డబుల్ బెడ్ రూం ల సమీపం లో ,ఎస్.సి కమ్యునిటీ హాల్ పక్కన 4 ఎకరాలు,కలెక్టరేట్ వెనుక 4 ఎకరాలు ముస్లిం స్మశాన వాటికల కు ప్రభుత్వం కేటాయించిన భూమిలో హద్దులులో కాంపౌండ్ వాల్ నిర్మించాలని సభ్యులు డాక్టర్ ఏ ఏ ఖాన్,హఫీజ్ ఖాన్ లు కలెక్టర్ ను కోరగా  మున్సిపల్,రెవెన్యూ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.పండుగల సందర్భంగా పాలు,నెయ్యి  ఇతర పదార్థాలు కల్తీ లేకుండా తనిఖీ లు నిర్వహించాలి పుడ్ ఇన్స్పెక్టర్ ను ఆదేశించ నున్నట్లు కలెక్టర్ తెలిపారు.మద్యం షాపులు,బెల్ట్ షాప్ లు నియంత్రణ చేయాలని ఎక్సైజ్ శాఖ అధికారి ని ఆదేశించారు.
జిల్లా ఎస్.పి.అపూర్వ రావు మాట్లాడుతూ శాంతి భద్రతలు సమస్య లేకుండా ప్రశాంత వాతావరణం లో పండుగలు జరుపుకునే లా పోలీస్ శాఖ ద్వారా బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు.రాత్రి పూట పోలీస్ గస్తీ ,ముఖ్యమైన ప్రాంతాలలో పోలీస్ పికెట్ లు ఏర్పాటు చేస్తామని,
 షాపులు రాత్రి సమయంలో ఉండే విధంగా పోలీస్ శాఖ అధికారులకు సూచించారు.సోషల్ మీడియా ద్వారా రెచ్చ గొట్టే,మత సామరస్యం భంగం కలిగించేలా,హింసను ప్రేరే పించేలా పోస్ట్ లు పెట్ట రాదని,ఎస్.పి.కార్యాలయం లో సోషల్ మీడియా సెల్ ద్వారా నిఘా వుంచి అటు వంటి వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.సమావేశం లో అబ్దుల్ ఖలీం, హషం,రఫీ ఇతర సభ్యులు పలు సూచనలు చేశారు.సమావేశం లో అదనపు ఎస్.పి. కె.అర్. కె ప్రసాద రావు,డి.ఎస్.పి.లు,ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

ప్రజలు పండుగలను భక్తి శ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో శాంతి యుతంగా జరుపుకోవాలి:జిల్లా కలెక్టర్ టి.వినయ్ క్రిష్ణా రెడ్డి*

Share This Post