ప్రజలు బ్యాంకుల చుట్టూ తిరగకుండా బ్యాంకులే ప్రజల వద్దకు వచ్చి సేవలందిస్తున్నాయని అదనపు కలెక్టర్ రాజర్షి షా అన్నారు.

ప్రజల వద్దకే బ్యాంకులు…. అదనపు కలెక్టర్ రాజర్షి షా

ప్రజలు బ్యాంకుల చుట్టూ తిరగకుండా బ్యాంకులే ప్రజల వద్దకు వచ్చి సేవలందిస్తున్నాయని అదనపు కలెక్టర్ రాజర్షి షా అన్నారు.
సోమవారం సంగారెడ్డి లోని శ్రీ బాలాజీ ఫంక్షన్ హాల్ లో లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో రుణ విస్తరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో 22 బ్యాంకులు పాల్గొని ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేశాయి. అట్టి స్టాల్స్ ని రాజర్షి ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడుతూ ఆర్థికంగా చేయూత నివ్వడానికి బ్యాంకులు ముందుకు వస్తున్నాయని, బ్యాంక్ ల సేవలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలన్నారు. బ్యాంకులు వివిధ రకాల రుణ సదుపాయాలను కల్పిస్తుందన్నారు. బ్యాంకులు ఇస్తున్న రుణాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలన్నారు.

ఏదైనా వ్యాపారం లేదా గృహ నిర్మాణం తదితర పనులు చేయాలంటే తప్పనిసరిగా రుణం అవసరముంటుందన్నారు. బ్యాంకులు ఎన్నో రకాల రుణాలు అందిస్తున్నాయని వాటికి సంబంధించిన పూర్తి అవగాహనతో రుణం పొందడంతోపాటు అన్ని విధాల సద్వినియోగం చేసుకావాలన్నారు . తిరిగి బ్యాంకు రుణం చెల్లించడం లోనూ ముందు ఉండాలన్నారు.
జిల్లాలో బ్యాంకర్ల తో ఎంతో సక్సెస్ అయ్యామని, షి క్యాబ్స్ లబ్ధిదారులకు అందించడానికి కెనరా బ్యాంక్ అందించిన సహకారాన్ని ఆయన గుర్తు చేస్తూ సంబంధిత బ్యాంకు వారిని అభినందించారు. అదేవిధంగా స్వయం సహాయక సంఘాలకు సంబంధించి 100% టార్గెట్ సాధించామని 99% లోన్ రీపేమెంట్ కూడా చేశామన్నారు.
ఆత్మ నిర్భర్ అభియాన్ లో వీధి వర్తకులకు అందించిన రుణాలలో సంగారెడ్డి ,జహీరాబాద్ మున్సిపాలిటీలు టాప్ 10 పొజిషన్ లో ఉన్నాయని, అందుకు సహకరించిన బ్యాంకర్లను ఆయన ఈ సందర్భంగా అభినందించారు.

అన్ని వర్గాల ప్రజలు బ్యాంకు అందిస్తున్న రుణ సదుపాయాన్ని వినియోగించుకోవాలన్నారు. రుణ విస్తరణ కార్యక్రమంలో రూ.110 కోట్ల రుణాలు వివిధ బ్యాంకుల ద్వారా లబ్ధిదారులకు అందించారు. అందులో స్వయం సహాయక సంఘాల కు బ్యాంకు లింకేజీ కింద 60 కోట్లు, వ్యవసాయ రుణాలు 40 కోట్లు, ఎం ఎస్ ఎం ఈ మరియు రిటేల్ రుణాలు రూ.10 కోట్లు చెక్కులనుఅందించారు.
ఆయా బ్యాంకులు ఏర్పాటుచేసిన స్టాల్లో ప్రజలు ఆయా బ్యాంకులు అందిస్తున్న తదితర విషయాల గురించి విషయాల గురించి వివిధ రుణాలు, వడ్డీ తదితర విషయాల గురించి అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో ఎల్ డి ఎం. రమణారెడ్డి, కెనరా బ్యాంక్ ప్రతినిధులు శ్రీమతి కనిమొళి, ఆర్. శ్రీనివాసరావు, ఎస్బిఐ రామ్ సింగ్, ఏపీజీవీబీ-పార్థసారథి, డి సి సి బి నుండి శ్రీనివాస్ , నాబార్డ్ ప్రతినిధి సెసిల్, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డి ఆర్ డి ఓ శ్రీనివాస రావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాబురావు, వివిధ బ్యాంకుల బ్యాంకర్లు, సహాయక సంఘాల మహిళలు, విద్యార్థులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post