ప్రచురణార్థం
ప్రజలు సమర్పించిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి …. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ
నేడు (87) దరఖాస్తులు స్వీకరణ
——————————-
పెద్దపల్లి, నవంబర్ -28:
——————————-
ప్రజలు తమ సమస్యలు తెలుపుతూ సమర్పించిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ జిల్లా అధికారులను ఆదేశించారు.
సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ అదనపు కలెక్టర్ లు వి. లక్ష్మీనారాయణ, కుమార్ దీపక్ లతో కలిసి ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజల విన్నపలకు అధిక ప్రాధాన్యత నిస్తూ త్వరితగతిన వారి సమస్యలను పరిష్కరించాలని జిల్లా అధికారులను ఆదేశించారు.
నేడు నిర్వహించిన ప్రజావాణిలో (87) దరఖాస్తులు వచ్చాయని, వాటిలో రెవెన్యూ శాఖకు సంబంధించినవి (52) దరఖాస్తులు, ఇతర శాఖలకు సంబంధించినవి (35 ) ఉన్నాయని తెలిపారు.
ఎలిగేడు మండలం బురహన్ మియాపేట గ్రామానికి చెందిన దుబ్బాసి సౌందర్య తన భర్త డి.శ్రీనివాస్ 2022 మే 23న వడదెబ్బ కారణంగా మరణించారని, తన ముగ్గురు పిల్లల పోషణార్థం తనకు వడదెబ్బ పరిహారం అందించాలని దరఖాస్తు చేసుకోగా కలెక్టరేట్ సి విభాగానికి రాస్తూ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు.
పెద్దపల్లి మండలం పెద్దబొంకూరు గ్రామానికి చెందిన బోడ్డు సమ్మయ్య గ్రామంలో తాను కోనుగోలు చేసిన ఇంటి వివరాలు మ్యూటేషన్ చేసి ఆన్ లైన్ లో నమోదు చేయాలని దరఖాస్తు చేయగా పెద్దపల్లి ఎంపీడీవోకు రాస్తూ డిసెంబర్ 7 నాటికి సమస్య పరిష్కరించాలని సూచించారు.
పెద్దపల్లి మండలం పెద్దబొంకూరు గ్రామానికి చెందిన కె.సతీష్ కుమార్ తమ పిల్లల పేరు మీద 2013-14 లో మంజూరైన బాలికా సంరక్షణ పథకం ప్రోసిడింగ్ జత చేస్తూ సంబంధిత బాండ్ పేపర్లు అందజేయాలని దరఖాస్తు చేసుకోగా జిల్లా సంక్షేమ అధికారికి రాస్తూ వెంటనే పరిశీలించి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
—————————————————
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, పెద్దపల్లిచే జారీ చేయనైనది.