ప్రజల్లో ప్లాస్టిక్ వాడాకాన్ని నివారించే లా అవగహన కల్పించాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి

పత్రికాప్రకటన..2 తేదిః 29-11-2021

ప్రజల్లో ప్లాస్టిక్ వాడాకాన్ని నివారించే లా అవగహన కల్పించాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి

జగిత్యాల, నవంబర్ 29: జిల్లాలో ప్లాస్టిక్ నిరోదించి, వాడకాన్ని తగ్గించేలా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి. రవి అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి జిల్లాలోని అన్నిశాఖల అధికారులతో జూమ్ వెబ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కన్వర్జేన్సి సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్లాస్టిక్ వేస్ట్ మ్యానేజ్ మెంట్ కార్యక్రమంలో బాగంగా 75 మైక్రాన్ కన్న తక్కవగా ఉన్న ప్లాస్టిక్ కవర్లను, ప్లాస్టిక్ వస్తువులను ఉపయోగించరాదని డిపిఓ, మున్సిపల్ మరియు ఇతర శాఖలు అధికారులు జిల్లాలోని ఎన్. జి.ఓ.లు ఇతర అసోసియోషన్ల ద్వారా ఆద్వర్యంలో సాంస్కృతిక సారధి కళాకారల ద్వారా ప్రజల్లో అవగాహాన కార్యక్రమాలను నిర్వహించాలని అన్నారు. మున్సిపల్ కమీషనర్లు పట్టాణాలో పాటు గ్రామీణ ప్రాంతాలలో కూడా తనిఖీలు నిర్వహించాలని, గ్రామపంచాయితిలలో కూడా అధికారులు తనిఖీలు నిర్వహించి వాటిని సీజ్ చేసి ,పెనాల్టీలు విధించి ఇకముందు ప్లాస్టిక్ ను వాడకుండా చూడడంతో పాటు, జూట్ బ్యాగులను వాడకాన్ని పెంచేలా డిఆర్డిఏ వివిధ సంఘాల ద్వారా అవగాహన కల్పించాలని పేర్కోన్నారు.
అధికారులు ప్రభుత్వ లక్ష్యాల ప్రగతిని సాధించాలని, ప్రభుత్వ కార్యాలయాలలో చెత్తచేదారం లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని, కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా పనిచేసే ప్రదేశాన్ని పరిశుభ్రంగా ఉంచుకోగలుగుతామని పేర్కోన్నారు. నెలలో ఒకరోజు (మూడవ శనివారం) ప్రభుత్వ కార్యాలయాలను శుభ్రం చేసే కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు.
టిఎస్ బి పాస్ ఆదేశాల ప్రకారమే నిర్మాణాలు జరిగేలా జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటి పర్యవేక్షించి, చర్యలు తీసుకోవాలని, గ్రామాలలో కూడా ఆదేశాల మేరకు మాత్రమే నిర్మాణాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని, నిర్మాణాల కొరకు ఇచ్చే అనుమతులు అధికారులు పరిశీలించాలని అన్నారు.ఎస్సి, ఎస్టీ ఋణాలను సకాలంలో అందించేలా చూడాలని ఆదేశించారు.
కోవిడ్ వ్యాక్సినేషన్ లో అలస్యం కాకుండా చూడాలని, జిల్లాలో 3 నుండి 4 వేల వరకు కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నప్పటికి పాజిటివ్ కేసుల నమోదు అంతకంతకు తగ్గిపోయినప్పటికి, అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రతిరోజు RTPCR, ర్యాపిడ్ పరీక్షల నివేధికలను ప్రతిరోజు అందించాలని, ఒమిక్రాన్‌ వైరస్ ప్రబావం లేకుండా ప్రజలు సామాజిక దూరం పాంటించడం, మాస్కులను దరించడం వంటి జాగ్రత్తలను పాటించేలా చూడాలని అన్నారు.
స్థిర, చర ఆస్థుల వివరాలను అందించాలని, పనికి రాకుండా ఖండేం చేయాల్సిన వాహనాల వివరాలను అందించాలని, శాఖల వారిగా అవుట్ సోర్స్ సిబ్బంది వివరాల నివేధికను పంపించాలని, ఇస్రామ్ ఫోర్టల్ లో అసంఘటిత రంగాలలో పనిచేసే కూలీల వివరాలను నమోదు చేయించడం వారికి అవగాహన కల్పిస్తూ, అక్కడిక్కడే నమోదు చేయించేలా చూడాలని, శాఖల వారిగా పెండింగ్ లో ఉన్న విద్యూత్ బకాయిలను చేల్లించాలని, డిసెంబర్ 1 నుండి శాఖలలో డిజిటల్ విద్యూత్ మీటర్లను ఏర్పాటు చేయించడం జరుగుతుందని పేర్కోన్నారు.
దాన్యం కొనుగోలును ప్రత్యేక అధికారులు ప్రతిరోజు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ, సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించడానికి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని, కొనుగోలు కేంద్రాలలో టార్పాలిన్లు, మాయిస్చర్ మిషన్లు, వెయింగ్ మిషన్లు అందుబాటులో ఉండడంతో పాటు లోడింగ్ అన్ లోడింగ్ ఇబ్బందులు లేకుండా పర్యవేక్షించాలని సూచించారు.ఆర్.ఓ.ఎఫ్.ఆర్ పోడు భూములు ఉన్న 12 మండలాల నుండి స్వీకరించిన ధరఖాస్తులను క్షుణంగా పరిశీలించాలని, ధరఖాస్తులను అన్ లైన్ లొ నమోదు చేయడానికి ముందు ధరఖాస్తును పూర్తిగా పరిశీలించి,పొరపాట్లు జరుగకుండా సరిగా ఉన్నట్లయితెనే నమోదు చేయాలని తెలియచేసారు..
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, జగిత్యాల చే జారి చేయనైనది.

Share This Post