ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం …. రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్.

ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం …. రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్.

ప్రచురణార్థం

ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం …. రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్.

మహబూబాబాద్, జూన్ -02:

ప్రజల అభివృద్ధి, సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు.

గురువారం స్థానిక ఎన్.టి.ఆర్. స్టేడియం లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలలో రాష్ట్ర గిరిజన స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని స్వయం పాలనతో ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భాన, రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నామనీ, తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు విచ్చేసిన జిల్లా ప్రజలకు, స్వాతంత్ర్య సమరయోధులకు, తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణ వాదులకు, అమరవీరుల కుటుంబ సభ్యులకు, ప్రజా ప్రతినిధులకు, అధికారులకు, అనధికారులకు, పాత్రికేయులకు, విద్యార్థినీ, విద్యార్థులకు ఈ సందర్భంగా మంత్రి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

అనేక ఉద్యమాలు, త్యాగాలు, బలిదానాల అనంతరం తెలంగాణా ప్రజల ఆకాంక్ష నెరవేరిందని, యుగకర్తగా గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ ఉద్యమం కోసం యావత్ ప్రజానీకాన్ని ఏకం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారన్నారు.

తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఒక్కసారి ఉద్యమ స్పూర్తిని పుణికి పుచ్చుకొని పునరంకితం కావడమే ఇప్పటి సందర్భం అని, సాధించుకొన్న తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చేందుకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నేతృత్వంలో అనేక సాహోసోపేతమైన నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగుతున్నారన్నారు.

రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ ఎనమిది వసంతాలలో వేసిన అడుగులు, తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు సామాన్యమైనవి కావనీ, దేశంలో మరెక్కడా లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని అందులో ఆసరా పెన్షన్లు, కళ్యాణలక్ష్మి, షాధిముబారక్ పథకాల ద్వారా అర్థిక చేయూత, డబుల్ బెడ్రూం ఇండ్లు, విద్యార్థులకు సన్నబియ్యం, కొత్తగా 510 రెసిడెన్సియల్ స్కూల్స్, ఎస్సి,ఎస్టీ లకు ప్రత్యేక ప్రగతి నిధి లాంటి కార్యక్రమాలెన్నో అమలు చేస్తున్నామని, తక్కువ వేతనాలతో పనిచేస్తున్న ఉద్యోగులను గుర్తించి, వారి జీతాలు భారీగా పెంచుకున్నామని, కనీస వేతన చట్టం ఖచ్చితంగా అమలు చేస్తున్న ప్రభుత్వం మనదనీ తెలుపుతూ, ఈ శుభ సమయాన జిల్లాలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.

జిల్లా ఏర్పాటు అనంతరం ఏరియా ఆసుపత్రిని జిల్లా ఆసుపత్రి గా అప్ గ్రేడ్ చేశామని, జిల్లాకు ప్రభుత్వ వైద్య, నర్సింగ్ కళాశాల మంజూరు చేసుకున్నామని, 100 పడకల జిల్లా వైద్యశాలను 330 పడకల ప్రభుత్వ సాధారణ వైద్య శాలగా అప్ గ్రేడ్ చేయడం జరిగిందని, 70 పడకల ఐసోలేషన్ వార్డ్, 12 పడకల ఐ.సి.యు. వార్డ్, గూడూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో 40 పడకల ఐసోలేషన్, 10 పడకల ఐ.సి.యు. ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

గర్బిణీస్త్రీలకు ఆర్థిక, ఆరోగ్య ప్రోత్సాహకములతో పాటు సుఖ ప్రసవం జరుగుట కొరకు రాష్ట్ర ప్రభుత్వం కె.సి.ఆర్.కిట్ ప్రారంభించిన తర్వాత నెలకు సుమారు 300 పైగా ప్రసవాలు జరుగుతున్నాయని తెలిపారు.

మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా జిల్లాలో గల ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలో మొదటి దశలో 316 పాఠశాలలో మౌళిక వసతుల కల్పనకు చర్యలు చేపట్టామని, రైతు బంధు, రైతు భీమా, రైతు వేదికలు, ఉద్యాన వనాలు, పట్టు పరిశ్రమ, పశు వైద్య, పశు సంవర్ధక శాఖ, సంక్షేమ అభివృద్ధి శాఖలు, మత్స్య శాఖ, పౌర సరఫరాలు, గ్రామీణాభివృద్ధి సంస్థ, తెలంగాణ హరితహారం, నర్సరీ, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు, పల్లె, పట్టణ ప్రగతి, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దళిత బందు, వ్యవసాయ శాఖ, తదితర శాఖల ద్వారా చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల లక్ష్యాలను, ప్రగతిని వివరించారు.

అనంతరం కేజీబీవీ మహబూబాబాద్, చిన్నగూడూరు, తొర్రూరు, పెద వంగర, జెడ్.పి.హెచ్.ఎస్. తొర్రూరు విద్యార్థిని లచె నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలను మంత్రి తిలకించారు. అమరవీరుల కుటుంబ సభ్యులు మరిపెడ మండలం ఏళ్ళంపేటకు చెందిన గులగట్టు మేష (ఆనంద్), గూడూరు మండలం తీగలవెని దారవత్ బావుసింఘ్ (మల్సుర్), కురవి మండలం సూడనపల్లి కి చెందిన తోడేటి సుశీల (నాగరాజు) లను మంత్రి సన్మానించారు. వివిధ శాఖలలో ఉత్తమ సేవలను అందించిన అధికారులను, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. అనంతరం వివిధ ప్రభుత్వ శాఖల చే ఏర్పాటుచేసిన స్టాల్ లను సందర్శించి దలితబందు లబ్దిదారులకు యూనిట్ లను పంపిణీ చేశారు.

అంతకుముందు మంత్రి కోర్టు సమీపంలో గల అమర వీరుల స్తూపం వద్ద ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులతో కలిసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ ఆవిర్భావ వేడుకల్లో జడ్పీ చైర్పర్సన్ బిందు, జిల్లా కలెక్టర్ కె. శశాంక, ఎస్పీ శరత్ చంద్ర పవార్, స్థానిక శాసనసభ్యులు బానోతు శంకర్ నాయక్, మున్సిపల్ చైర్పర్సన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు, జిల్లా అదనపు కలెక్టర్ లు అభిలాష అభినవ్, ఎం. డేవిడ్, డి ఎఫ్ ఓ రవి కిరణ్, సి డబ్ల్యూ సి చైర్మన్ నాగవాణి, జడ్పీ సీఈఓ రమాదేవి, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, అమరవీరుల వీరుల కుటుంబాల సభ్యులు, అవార్డు గ్రహీతలు, అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Share This Post