ప్రజల అర్జీలను సత్వరమే పరిష్కరించాలి ….. జిల్లా కలెక్టర్ కె. శశాంక.

ప్రజల అర్జీలను సత్వరమే పరిష్కరించాలి ….. జిల్లా కలెక్టర్ కె. శశాంక.

ప్రచురణార్థం

ప్రజల అర్జీలను సత్వరమే పరిష్కరించాలి ….. జిల్లా కలెక్టర్ కె. శశాంక.

మహబూబాబాద్, మే -23:

ప్రజలు తమ సమస్యలు తెలుపుతూ ప్రజావాణిలో సమర్పించిన అర్జీలను, డయల్ యువర్ కలెక్టర్ లో ఫోన్ ద్వారా తెలిపిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక జిల్లా అధికారులను ఆదేశించారు.

సోమవారం జిల్లా కలెక్టర్ కె. శశాంక కలెక్టరేట్ లోని ప్రజ్ఞా సమావేశ మందిరం లో డయల్ యువర్ కలెక్టర్, ప్రగతి సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుండి విన్నపాలు స్వీకరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, అర్జీలను వెంటనే పరిష్కరించాలని తెలిపారు. జూన్ రెండవ తేదీన నిర్వహించు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలలో గత రెండు సంవత్సరాల నుండి ఆయా శాఖలు సాధించిన ప్రగతి ప్రజల ముందు ఉంచేందుకు తమ శాఖకు సంబందించిన ప్రగతి నివేదికను సి.పి. ఓ కు వెంటనే అందించాలని అధికారులను ఆదేశించారు.

ఈ రోజు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో (65) దరఖాస్తులు వచ్చాయి.

అంతకుముందు ప్రజ్ఞా సమావేశ మందిరంలో నిర్వహించిన డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో (13) మంది తమ సమస్యలను ఫోన్ ద్వారా జిల్లా కలెక్టర్ కు తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్, జెడ్పీ సి.ఈ. ఓ. రమాదేవి, డి.ఆర్.డి. ఓ. సన్యాసయ్య, డి.పి. ఓ. సాయి బాబా, ఇతర జిల్లా అధికారులు, కలెక్టరేట్ పరిపాలన అధికారి వెంకట రమణ, పర్యవేక్షకులు అనురాధ, తదితరులు పాల్గొన్నారు.

Share This Post