ప్రజల అవసరాలకు తగ్గట్టుగా పంప్ హౌస్ నిర్మాణాలు ఉండాలి….. జిల్లా కలెక్టర్ కె. శశాంక

ప్రజల అవసరాలకు తగ్గట్టుగా పంప్ హౌస్ నిర్మాణాలు ఉండాలి….. జిల్లా కలెక్టర్ కె. శశాంక

ప్రచురణార్థం

ప్రజల అవసరాలకు తగ్గట్టుగా పంప్ హౌస్ నిర్మాణాలు ఉండాలి….. జిల్లా కలెక్టర్ కె. శశాంక.

మహబూబాబాద్, జూన్ -05:

ప్రజల అవసరాలకు తగ్గట్టుగా పంప్ హౌస్ నిర్మాణాలు ఉండాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక తెలిపారు.

పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ కె.శశాంక మునిసిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి తో కలిసి ఆదివారం ఉదయం స్థానిక గోపాలపురం లో నిర్మిస్తున్న మిషన్ భగీరథ పంప్ హౌస్ నిర్మాణ పనులను పరిశీలించి ఎన్.సి.సి వారిని త్వరగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఇంటింటికి నల్లాల ద్వారా శుద్ధమైన రక్షిత మంచినీరు సరఫరా చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం మేరకు రానున్న 30 సంవత్సరాల కాలం వరకు ప్రజల అవసరాలకు తగ్గట్టుగా పంప్ హౌస్ నిర్మాణాలు, పైపులైన్ లు ఏర్పాటు చేసి పట్టణంలోని చివరి ఇంటి వరకు కూడా నీటి సరఫరాలో వ్యత్యాసం రాకుండా సరఫరా చేయాలని, ఇబ్బందులు లేకుండా చూడాలని అన్నారు.

పైప్ లైన్ పనులను పకడ్బందీగా చేస్తూ ఎటువంటి లీకేజీలు లేకుండా చూడాలని, పైప్ లైన్ లు త్రవ్వి వేసే క్రమంలో పైపులు వేసిన అనంతరం రోడ్డు పూడ్చే పనులు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు.

పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నాణ్యతా ప్రమాణాలు పాటించే విధంగా చూడాలని, ఎం బి ఆర్., ఈ.ఎస్.ఆర్. అవుట్ లెట్ల వద్ద ఫ్లో మీటర్ లను ఏర్పాటు చేయాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ ప్రసన్న రాణి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సిహెచ్ ఉపేందర్, మునిసిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ బి సురేష్, ఫ్లోర్ లీడర్ చిట్యాల జనార్ధన్, ఇంజనీరింగ్ విభాగం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Share This Post