ప్రజల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకొని, ప్రతి హ్యాబిటేషన్ ప్రజలు మెడికల్ క్యాంపులో ఎక్కువగా పాల్గొనేలా చర్యలు తీసుకోవాలి ….. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్

ప్రజల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకొని, ప్రతి హ్యాబిటేషన్ ప్రజలు మెడికల్ క్యాంపులో ఎక్కువగా పాల్గొనేలా చర్యలు తీసుకోవాలి ….. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్

ప్రచురణార్థం

మహబూబాబాద్, ఆగస్ట్ -05:

ప్రజల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకొని, ప్రతి హ్యాబిటేషన్ ప్రజలు మెడికల్ క్యాంపులో ఎక్కువగా పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు.

శుక్రవారం కలక్టరేట్ ప్రగతి సమావేశ మందిరంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ సీజనల్ వ్యాధులు ప్రభలకుండా క్యాంపులు, ప్రజల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలపై వైద్య అధికారులు, ఎం.పి. ఓ లతో సమీక్షించారు.

అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి గ్రామ పంచాయితీ, ప్రతి హ్యాబిటేషన్ లోని ప్రజలకు వైద్య సేవలు అందే విధంగా క్యాంపులు ఏర్పాటు చేయాలని, క్యాంపులు నిర్వహిస్తున్న సమాచారం ప్రజలకు ఒక రోజు ముందుగా తెలిపి ఎక్కువగా ప్రజలు పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పంచాయతీ సెక్రటరీ, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సభ్యులు, ఆశ, ఏ.ఎన్.ఎం.లు హ్యాబిటేషన్ వారిని పిలవాలని సూచించారు.

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, కీటకాల ద్వారా సంక్రమించే వ్యాధుల నివారణకు రసాయనాలు ఉపయోగించి చర్యలు తీసుకోవాలని, నీటి కాలుష్యము ద్వారా వచ్చే వ్యాధులను నివారించుటకు బ్లీచింగ్ పౌడర్ ను ఉపయోగించి నీటిని శుద్ది చేయాలని, మెదడు వాపు డెంగ్యూ కారక దోమలు నిర్మూలనకు వారానికి ఒకసారి ఫాగింగ్ చేయాలని, మలేరియా, డెంగ్యూ వ్యాప్తి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, నీటి నిల్వలు లేకుండా చూడాలని, గంబూషియా చేపలు వదలడం ద్వారా దోమల లార్వాను ఈ చేపలు ఆహారంగా స్వీకరిస్థాయిని తెలిపారు. మురుగు నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో బైటెక్స్ పిచికారి చేసి పైలేరియా మెదడు వాపు వ్యాధిని కలిగించే దోమలను నివారించుటకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

గ్రామాల్లో పారిశుధ్యం పాటించేలా, వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించేలా అవగాహన కల్పించి ప్రతి గ్రామ పంచాయితిని ఆరోగ్యవంతమైన జి.పి.గా తీర్చి దిద్దాలని, పల్లె నివేదిక బోర్డులు అందాయ అని అడిగి తెలుసుకున్నారు. ఓ.హెచ్.ఎస్.ఆర్. ట్యాంకులను శుభ్రం చేయాలని, ట్యాంకులను కలరింగ్ చేయాలని, రెండు నెలలు ఎక్కువ సిబ్బందిని ఏర్పాటు చేసుకొని పరిశుభ్రతపై దృష్టి పెట్టాలని తెలిపారు. జి.పి.లలో ఉన్న ట్రాక్టర్, ట్రాలీ లు పనిచేస్తున్నాయ అని, ఇన్సూరెన్స్ చేసిన వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ప్రతి జి.పి.లో.ఒక స్వచ్చ దూతను ఏర్పాటు చేసి పారిశుధ్యం కార్యక్రమం సమర్థవంతంగా నిర్వహించి గ్రామాల్లో, ఇళ్ల పక్కన చెత్తను వేయకుండా చూడాలని తెలిపారు. జి.పి. సొంత భవనంలో, అంగన్వాడి లలో మిషన్ భగీరథ కనెక్షన్ ఉండాలని తెలిపారు.

కోవిద్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా జాగ్రత్తలు తీసుకోవాలని మాస్క్, సానిటైజేషన్ వాడే విధంగా చూడాలని తెలిపారు.

గ్రామ పంచాయతీలో లైబ్రరీ సెస్ డిమాండ్, పేమెంట్, వెహికల్ ట్రాకింగ్, ట్రాక్టర్.డ్రైవర్స్ రిజిస్ట్రేషన్ వైకుంఠ ధామం, సెగ్రిగేషన్ షెడ్ కు విద్యుత్ సరఫరా కనెక్షన్ పై ఎం.పి. ఓ లతో సమీక్షించారు.

ఈ కార్యక్రమంలో డి.పి. ఓ. సాయిబాబా, డిప్యూటీ డి.ఎం.హెచ్. ఓ. అంబరీష, ఎం.పి. ఓ లు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post