ప్రజల ఆర్జీలను పరిశీలించి నిబంధనల మేరకు పరిష్కరించాలి :: జిల్లా కలెక్టర్ ఎస్. క్రిష్ణ ఆదిత్య.

ప్రజల నుండి వివిధ సమస్యలపై వచ్చిన ఆర్జీలను సంబంధిత అధికారులు పరిశీలించి నిబంధనల మేరకు పరిష్కరించాలని
జిల్లా కలెక్టర్ యస్. క్రిష్ణ ఆదిత్య అన్నారు.

సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్
ఎస్.కృష్ణ ఆదిత్య, అదనపు కలెక్టర్ ఎల్.బి. ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వైవి గణేష్ లతో కలసి నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో (11 ) దరఖాస్తులు రాగా భూ సంభందిత రెవెన్యూ సమస్యలు(10) , ఇతర శాఖలకు సంబంధించి (1) అర్జీలు స్వీకరించడం జరిగింది.

ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్ లో ఉంచకుండా వెంటనే పరిష్కరించాలని, తిరస్కరించిన పక్షంలో తిరస్కరణకు గల
కారణాలను వివరంగా తెలుపుతూ అర్జిదారునికి అందజేయాలని అధికారులను కలెక్టర్ సూచించారు.

ఈ సందర్భంగా మంగపేట మండలం రమణక్కపేట గ్రామంలోని కొమురం భీం ఎస్టీ ఇసుక క్వారీ గ్రామంలో 120 కుటుంబాలలో ఒక కుటుంబం మాత్రమే మ్యాక్స్ సొసైటీ కావాలని కోరుతున్నట్లు తెలిసిందని, రమణక్కపేటలో మరొక క్వారీని మంజూరు చేయొద్దని గ్రామస్తులు దరఖాస్తు చేసుకున్నారు.

కళ్లెపు రాజయ్య తండ్రి లచ్చయ్య వెంకటాపుర్ మండలం నర్సాపూర్ గ్రామం ఎస్సీ కులస్తుడని 1650 సర్వే నెంబర్ లో మా తాతగారి పేరున 17 గుంటల స్థలం ఉన్నదని అది మా పేరు మీద చేయాలని దరఖాస్తు చేసుకున్నారు.

అనంతరం జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశం లో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ములుగు వెలుగు అటెండెన్స్ యాప్ లో సిబ్బంది ప్రతిరోజు హాజరు నమోదు చేస్తున్నారా లేదా పర్యవేక్షించాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో డిఆర్ఓ రమాదేవి, జిల్లా పరిషత్ సీఈవో ప్రసూనరాణి, డి ఆర్ డి ఓ నాగ పద్మజ, ఏ టి డి ఓ దేశిరామ్, డి ఎం హెచ్ ఓ అల్లం అప్పయ్య, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి ఎం ప్రకాష్, ఎస్సీ డెవలప్మెంట్ అధికారి పి భాగ్యలక్ష్మి, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి ఎస్ లక్ష్మణ్, టి రాజ్ కుమార్ ఎల్డీఎం, డి సి ఓ సర్దార్ సింగ్, డిఇఓ పాణి,ఉపాధి కల్పన అధికారి కుమారస్వామి, ఎస్సీ కార్పొరేషన్ అధికారి టి రవి , డి సి ఎస్ ఓ అరవింద్ రెడ్డి, ఇతర జిల్లా అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.

Share This Post