జిల్లా వ్యాప్తంగా ప్రజావాణిలో 78 దరఖాస్తులు స్వీకరించిన అధికారులు
సోమవారం శామీర్పేటలోని జిల్లా కలెక్టరేట్ కార్యాయలంలోని సమావేశ మందిరంలో జిల్లా లా ఆఫీసర్ చంద్రావతితో కలిసి జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్ ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు, వినతులు, విజ్ఞప్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజావాణిలో మొత్తం 78 దరఖాస్తులు రాగా అందులో ఆయా శాఖలకు సంబంధించిన విజ్ఞప్తులు, దరఖాస్తులను సంబంధిత శాఖల జిల్లా అధికారులకు అందచేసి సంబంధిత సమస్యను ఆర్జీ సమర్పించిన వెంటనే పరిష్కరించేలా అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.