ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులు వెంటనే పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని గద్వాల్ జిల్లా రెవిన్యూ డివిజినల్ అధికారి రాములు ఆదేశించారు.

పత్రికా ప్రకటన                                                                      తేది:6-6- 2022

జోగులాంబ గద్వాల్

 

ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులు వెంటనే పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని గద్వాల్ జిల్లా రెవిన్యూ డివిజినల్ అధికారి  రాములు ఆదేశించారు.

సోమవారం కల్లెక్టరేట్ సమావేశం హలునండు ఏర్పాటు చేసిన ప్రజావాణి సందర్భంగా వివిధ  సమస్యలపై వచ్చిన ప్రజా పిర్యాదులను స్వీకరించారు. ధరణి సమస్యలపై, వికలాంగులు, వితంతువులు, వృద్ధాప్య పింఛన్ల పై  85  పిర్యాదులు అందాయని ,35  ధరణికి సంబందించినవి,50 దరకాస్తులు వివిధ సమస్యలపై వచ్చిన దరకాస్తులను సంబందిత  అధికారులకు  అందజేసి వెంటనే పరిష్కరామయ్యేలాచూడాలని అధికారులకు తెలిపారు.  అలంపూర్ మండలం క్యాతూర్ గ్రామానికి  చెందిన పుణ్యవతి అనే 7 5  సం. మహిళ తన  ఇద్దరు కుమారులుచుడనందున  తన జీవనోపాది కష్టంగా ఉనందున  తనకున్న మూడెకరాల భూమిని అమ్ముకొనుటకు సిద్దపడగా, నీకు  అర్హత లేదని చిన్న  కుమారుడు నాగేశ్వర్రెడ్డి బార్య సురేఖ కేసు పెట్టిందని  ఫిర్యాదును అందజేయగ అట్టి పిర్యడును పరిశీలించి  సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.  జిల్లా అధికారులు  పెండింగ్ ఉంచకుండా త్వరితగతిన పరిష్క రించాలని తెలిపారు.

. ఈ  కార్యక్రమంలో జిల్లా అధికారులు, ఏ ఓ  అజమ్ అలీ, తాసిల్దార్ రాజు తదితరులు పాల్గొన్నారు

—————————————————————————————

జిల్లా పౌరసంబంధాల అధికారి జోగులాంబ గద్వాల జారీ చేయబడింది.

Share This Post