ప్రజల ఫిర్యాదులకు సత్వరమే పరిష్కారం చూపాలి – కలెక్టర్ పి ఉదయ్ కుమార్

ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు అందించిన ఫిర్యాదుల పై అధికారులు సత్వర పరిష్కార మార్గాలు చూపాలని జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్ అధికారులను ఆదేశించారు.
నాగర్ కర్నూలు జిల్లా కార్యాలయంలోని ప్రజావాణి సమావేశ మందిరంలో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో అర్జీదారుల నుంచి అదనపు కలెక్టర్లు మన చౌదరి, మోతిలాల్ లతో కలిసి జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ 47 అర్జీలు స్వీకరించి మాట్లాడారు.
ప్రజావాణి ఫిర్యాదుల సమస్యలపై సంబంధిత శాఖల అధికారులు ఆర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి, బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలన్నారు.
వివిధ శాఖల జిల్లా అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Post