ప్రజల విజ్ఞాపణలను పరిశీలించి చర్యలు తీసుకుంటాం- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

ప్రజల విజ్ఞప్తులను పరిశీలించి ఆయా శాఖల ద్వారా చర్యలు చేపట్టడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులు నుండి విజ్ఞాపనలను కలెక్టర్ స్వీకరించారు. పాఠశాలల్లో ఉర్దూ మీడియం ఉపాధ్యాయులను నియమించాలని, గ్రామాలలో పారిశుధ్య కార్యక్రమాలను నిర్వహించాలని, దళిత అభివృద్ధి శాఖ నుండి రుణాలు మంజూరు చేయాలనీ, గ్రామాలలో విద్యుత్ సమస్య ఏర్పడుతున్నది, రాత్రి వేళల్లో బేల మండలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగిందని గ్రామస్తులు కలెక్టర్ కు నివేదించారు. ట్రాన్స్కో అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరాలో సమస్యలను నివృత్తి చేసి సరఫరా అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దివ్యంగులకు సదరం క్యాంపులు నిర్వహించి సదరం సర్టిఫికెట్ అందజేయాలని ఆయా అర్జీదారులు గ్రామసమస్యలు, వ్యక్తిగత సమస్యలపై దరఖాస్తులు సమర్పించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, అర్హత కలిగిన వారందరికీ రుణాలు మంజూరు చేయడం జరుగుతుందని, ఉర్దూ బాషా బోధనకు ఉపాధ్యాయులను నియమించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామాలలో పారిశుధ్య కార్యక్రమాలను నిరంతరం కొనసాగించాలని జిల్లా పంచాయితీ అధికారిని ఆదేశించారు. ఇంద్రవెల్లి మండలానికి చెందిన అంద (Blind) వైకల్యం కలిగిన దేవిదాస్ కు ఎస్సీ కార్పొరేషన్ నుండి మసాలా దినుసులు ప్యాకింగ్, అమ్మకలకు లక్ష రూపాయలు ఋణం మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. భూములకు సంబంధించిన సమస్యలను ధరణి వెబ్ సైట్ లో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. ఆదిలాబాద్ పట్టణంలో మహిళా డిగ్రీ కళాశాల సమీపంలో నిర్మిస్తున్న దుకాణాల సముదాయాన్ని తొలగించాలని విద్యార్థులు కలెక్టర్ ను కోరగా, సంబంధిత శాఖల అధికారులతో కమిటీ వేసి నివేదిక తెప్పించుకొని నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. ఫించన్ లకు సంబంధించిన దరఖాస్తులను ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ప్రజావాణిలో అదనపు కలెక్టర్లు రిజ్వాన్ బాషా షేక్, ఎన్.నటరాజ్, ఆర్డీఓ రాజేశ్వర్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, జడ్పీ సీఈఓ గణపతి, జిల్లా పంచాయితీ అధికారి శ్రీనివాస్, LDM చంద్రశేఖర్, వివిధ సంక్షేమ శాఖల అధికారులు, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Share This Post