ప్రజల సమస్యలకు పరిష్కారం చూపాలి…

ప్రచురణార్థం

ప్రజల సమస్యలకు పరిష్కారం చూపాలి…

మహబూబాబాద్ సెప్టెంబర్ 27.

ప్రజలు ఇచ్చిన దరఖాస్తులను అధికారులు సమగ్రంగా పరిశీలించి ప్రతి సమస్యకు తప్పనిసరిగా పరిష్కారం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు.

సోమవారం గ్రీవెన్స్ డే పురస్కరించుకొని కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని కలెక్టర్ నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ పలువురి దరఖాస్తుల విజ్ఞప్తులు ఫిర్యాదులు స్వీకరించారు.

అనంతరం మాట్లాడుతూ గ్రీవెన్స్ లో స్వీకరించి ప్రతి దరఖాస్తును అధికారులు సమగ్రంగా పరిశీలించి పరిష్కారం ఇవ్వాల్సి ఉంటుందన్నారు ప్రతి దరఖాస్తు కు వారంలో గానే సమాధానం ఇవ్వాలని సూచించారు.

ఈ గ్రీవెన్స్ డే లో అదనపు కలెక్టర్ కొమురయ్య జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు
————————————————————-
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post