ప్రజల సమస్యలకు సత్వరమే పరిష్కారం…

ప్రచురణార్థం

ప్రజల సమస్యలకు సత్వరమే పరిష్కారం…

మహబూబాబాద్, డిసెంబర్-20:

ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్ శశాంక తెలిపారు.

సోమవారం గ్రీవెన్స్ డే పురస్కరించుకొని కలెక్టర్ కార్యాలయ ప్రగతి సమావేశ మందిరంలో  ఏర్పాటుచేసిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి కలెక్టర్ పలు విజ్ఞప్తులు స్వీకరించారు.

బయ్యారం మండలం గౌరారం కు చెందిన దివ్యాంగురాలు వజ్జ సైదమ్మ  పదవ తరగతి చదువుతున్నానని, ఉన్నత విద్యాభ్యాసం కొరకు మూడు చక్రముల మోటార్ వాహనం మంజూరు చేయాలని దరఖాస్తు అందించారు.

తొర్రూరు మండలం ఖానాపురంకు చెందిన తుమ్మ శైలజ తన తల్లి ఇచ్చిన భూమిని అన్నయ్య యాకుల్ రెడ్డి పట్టా చేయించుకున్నారని చర్య తీసుకోవాల్సిందిగా కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు.

నెల్లికుదురు మండలం చెన్నా ముప్పారం గ్రామానికి చెందిన రాఇల్లి ఉపేందర్ తను దివ్యాంగుడు అయినందున ఏ పని చేసుకోలేక పోతున్నానని తనకు ముప్పై ఐదు కేజీలు రేషన్ బియ్యం మంజూరు చేయాల్సిందిగా కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు.

తొర్రూర్ మండల కేంద్రానికి చెందిన బెజ్జంకి బిక్షం రెడ్డి వెంకటరెడ్డి లు కలిసి 33 / 11 లైను మార్పిడి చేయాల్సిందిగా కలెక్టర్ కు దరఖాస్తు అందించారు.

తొర్రూర్ మండలం వెంకటాపురం కు చెందిన దివ్యాంగులు గుండాల రవి కుమార్ తనకు కంటి చూపు లేనందున ఉన్నత విద్య అభ్యసించేందుకు లాప్టాప్ మంజూరు చేయాలని దరఖాస్తు అందించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి విజ్ఞప్తిని సంబంధిత అధికారికి పంపించి సమగ్రంగా పరిశీలించి దరఖాస్తు దారులకు న్యాయం చేకూరుస్తానని తెలియజేశారు.

ఈ గ్రీవెన్స్ డే లో అదనపు కలెక్టర్ లు అభిలాష్ అభినవ్, కొమరయ్య, జడ్పీ సీఈఓ రమాదేవి, డిఆర్డిఎ పిడి సన్యాసయ్య, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
—————————————————————————————————————
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ చే జారీ చేయడమైనది

Share This Post