ప్రజల సమస్యలను తక్షణం పరిష్కరించాలి…

ప్రచురణార్థం

ప్రజల సమస్యలను తక్షణం పరిష్కరించాలి…

మహబూబాబాద్ అక్టోబర్ 4.

ప్రజల సమస్యల పరిష్కారంలో జాప్యం చేయరాదని వారంలోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు.

సోమవారం కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే పురస్కరించుకొని ప్రజావాణి కార్యక్రమం నిర్వహించి పలు విజ్ఞప్తులు ఫిర్యాదులు స్వీకరించారు.

చిన్న గూడూరు మండలం విస్సంపల్లి గ్రామ సర్పంచ్ స్మశాన వాటిక పనులలో అక్రమాలకు పాల్పడ్డారని, ట్రాక్టర్ లను ప్రయివేట్ పనులకు వినియోగించు కుంటున్నారని, గ్రామసభ ఆమోదం పొందడంలేదని పలువురు విస్సంపల్లి గ్రామప్రజలు ఫిర్యాదు చేశారు.

మహబూబాబాద్ మున్సిపల్ పరిధిలోని 12వ వార్డ్ స్నేహ నగర్ అంగన్వాడీ టీచర్ పోస్ట్ నియామకం కొరకు చర్యలు తీసుకోవాలని వై.వంశీ కోరారు.

డోర్నకల్ మండలానికి చెందిన సిగ్నల్ తండా కు చెందిన బాణోత్ శంకర్ తన దరఖాస్తు నందిస్తూ తాత బాణోత్ భోజ్య పేరున 78సర్వే నెంబర్ లోని 9ఎకరాల33 కుంటల భూమిని హద్దులు చూపించి తన పేరు పై నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు.

నెల్లికుదురు మండలం వావిలాల కు సైజెందిన బొల్లెపల్లి ఉప్పలయ్య తను ఉపాధిహామీ పథకం లో 100 రోజుల పని మూడు వారాలు చేశామని చేసిన పనికి డబ్బులు చెల్లించలేదని ఫిర్యాదు చేశాడు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి విజ్ఞప్తిని సమగ్రంగా పరిశీలించి తగు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఈ గ్రీవిన్స్ డేలో అదనపు కలెక్టర్ లు అభిలాష అభినవ్,కొమరయ్య, శిక్షణ కలెక్టర్ అభిషేక్ అగస్త్య, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
———————————————————–
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం…మహబూబాబాద్ వారిచే జారిచేయనైనది.

Share This Post