సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరం లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా లోని వివిధ మండలాల నుండి వచ్చిన ప్రజలు నుండి వారు దరఖాస్తులు స్వీకరించారు. ధరణి, ఉపాధి,పింఛన్ లు, పంచాయతీ రాజ్ ఇతర సమస్యల పై ప్రజలు అర్జీలు సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల సమస్యలను సంబందిత శాఖల అధికారులు పరిశీలించి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో డి.ఆర్.ఓ. జగదీశ్వర్ రెడ్డి ,ఇతర అధికారులు పాల్గొన్నారు
