ప్రజల సమస్యలను పరిశీలించి చర్యలు తీసుకుంటాం- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

ఆగష్టు 23, 2021ఆదిలాబాదు:-

ప్రజల సమస్యలను పరిశీలించి సాధ్య సాధ్యాల మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం రోజున కలెక్టరేట్ కార్యాలయంలో వివిధ వర్గాల ప్రజల నుండి సమస్యలపై అర్జీలను స్వీకరించారు. ఈ సందర్బంగా భూ సమస్యలు, ఉపాధి అవకాశాలు, వివిధ రకాల ఫించన్ లు, రేషన్ కార్డు ల మంజూరుకు అర్జీలను సమర్పించారు. ఆయా అర్జీలను సంబంధిత శాఖలకు పంపించి పరిశీలించి చర్యలు చేపట్టాలని అధికారులకు పంపించారు. రాష్ట్రంలో దళిత బంధు కార్యక్రమం మాదిరిగానే ఆదివాసీ బంధు ద్వారా ప్రతి ఆదివాసీ కుటుంబానికి పది లక్షలు రూపాయలు ఇవ్వాలని, సాగు చేస్తున్న అటవీ భూములకు అటవీ హక్కు పత్రాలు ఇవ్వాలని, భూమి లేని ప్రతి ఆదివాసీ కుటుంబానికి మూడెకరాల భూమి ఇవ్వాలని, ఇండ్ల స్థలాలు కేటాయించి డబుల్ బెడ్ రూమ్ లు నిర్మించి ఇవ్వాలని, పలు రకాల సమస్యలపై అర్జీలను కలెక్టర్ కు సమర్పించారు. అర్జీలు సమర్పించిన వాటిని పరిశీలించి చర్యలు తీసుకుంటామని అర్జీదారులకు తెలిపారు.

…………………………………………………………………. జిల్లా పౌర సంబంధాల అధికారి, ఆదిలాబాదు గారిచే జారీ చేయనైనది.

Share This Post