ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ఆయా శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు కోరారు.

ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ఆయా శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు కోరారు.

సోమవారం వివిధ సమస్యలతో జిల్లా కలెక్టరేటుకు వచ్చిన ప్రజల నుండి కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, రాజార్షీ షా తో కలసి అర్జీలను స్వీకరించారు.

అర్జీదారుల సమస్యలను సావధానంగా విని విజ్ఞప్తులను స్వీకరించారు. ఆయా శాఖల అధికారులు వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.

పలువురు ధరణి భూసమస్యలు, పెన్షన్లు, రైతు బీమా, ఉద్యోగాలు కల్పించాలని, ఆర్థిక సహాయం కోరుతూ అర్జీలను అందజేశారు. ఎవరు కార్యాలయాల చుట్టూ తిరగవద్దని, విజ్ఞప్తులను పరిశీలించి ఆయా శాఖల అధికారులు వేగవంతంగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. వివిధ సమస్యలపై సుమారు 53 అర్జీలు అందాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Share This Post