ప్రజల సమస్యలను పరిష్కరిస్తాం

ప్రచురణార్ధం

ప్రజల సమస్యలను పరిష్కరిస్తాం

మహబూబాబాద్, నవంబర్,15.

ప్రజల విజ్ఞప్తులు పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు.

సోమవారం గ్రీవెన్స్ డే పురస్కరించుకుని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పాల్గొని పలు విజ్ఞప్తులు స్వీకరించారు.

గూడూరు మండలం నాయకపెల్లి గ్రామానికి చెందిన దివ్యంగురాలు తండా జానకమ్మ 10వ తరగతి వరకు చదువుకున్నానని తనకు బ్యాటరీ ట్రై సైకిల్ మంజూరు చేయాలని విజ్ఞప్తిని అందించారు.

నెల్లికుదురు మండలకేంద్రానికి చెందిన దివ్యంగుడు ప్రభాకర్ తాను డిగ్రీ చదువుతున్నానని కళాశాలకు వెళ్లి వచ్చేందుకు ఇబ్బంది పడుతున్నందున బ్యాటరీ ట్రై సైకిల్ మంజూరు చేయాలని విజ్ఞప్తిని అందించారు.

గార్ల మండల కేంద్రానికి చెందిన దివ్యంగురాలు భూక్యా అనిత తాను నిరుపేద అని ఏ.ఎన్.ఎమ్. పోస్ట్ కు దరఖాస్తు చేసుకున్న పొందలేక పోయానని కుటుంబ పోషణకు ఏదైనా ఆధారం కల్పించాలని కోరారు.

మహబూబాబాద్ పట్టణం లోని భవాని నగర్ కు చెందిన భట్టు రాణి టి టిఫిన్ సెంటర్ తో జీవనం కొనసాగిస్తున్న తనను అకారణంగా తొలగించారని తగిన న్యాయం చేకూర్చాలన్నారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి దరఖాస్తును సమగ్రంగా పరిశీలించి తగు న్యాయం చేకూరుస్తామని తెలిపారు.

అనంతరంఅదనపు కలెక్టర్ లు, జిల్లా అధికారులు బాలల హక్కుల పరిరక్షణకు పాటుపడతాం అని బ్యానర్ పై సంతకం చేశారు.

ఈ గ్రీవెన్స్ డే లో అదనపు కలెక్టర్ కొమరయ్య, జడ్పి సి.ఈ.ఓ.రమాదేవి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
—————————
జిల్లా పౌరసంబంధాల అధికారి, కార్యాలయం,..మహబూబాబాద్ వారిచే జారిచేయనైనది.

Share This Post