ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ప్రజావాణి కార్యక్రమం, జిల్లా వ్యాప్తంగా ప్రజావాణిలో 52 వినతుల స్వీకరణ డీఆర్వో లింగ్యానాయక్

పత్రిక ప్రకటన

తేదీ : 30–05–2022

ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ప్రజావాణి కార్యక్రమం

జిల్లా వ్యాప్తంగా ప్రజావాణిలో 52  వినతుల స్వీకరణ

ప్రజావాణి వినతులు డీఆర్​వో లింగ్యానాయక్​

ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజావాణిలో వచ్చిన సమస్యలను ప్రాధాన్యతాక్రమంలో వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని మేడ్చల్​ – మల్కాజిగిరి జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్​వో) లింగ్యానాయక్​ అన్నారు.  సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని  కలెక్టరేట్​లోని ప్రజావాణి హాల్​లో జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్​ జిల్లా అధికారులతో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని ఆయా గ్రామాలు, పలు ప్రాంతాల నుంచి 52 వినతులు స్వీకరించి సంబంధిత అధికారులకు వాటిని పరిష్కరించాలని తెలిపారు.  ప్రజావాణిలో వచ్చి ప్రతి దరఖాస్తు, సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఈ సందర్భంగా ఆయన అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో  ఆయా శాఖల జిల్లా అధికారులు, సంబంధిత శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Post