ప్రజాకవి కాళోజీ తెలంగాణా యాసలో కవిత రాసిన మొట్ట మొదటి కవి చిరస్మరణీయులు అని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు.

పత్రిక ప్రకటన                                                                    తేది 09.09.2021

ప్రజాకవి కాళోజీ తెలంగాణా యాసలో కవిత  రాసిన మొట్ట మొదటి కవి చిరస్మరణీయులు అని జోగులాంబ గద్వాల  జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి  అన్నారు.

గురువారం కలెక్టర్ సమావేశ హాలు నందు కాళోజీ నారాయణరావు 108వ జయంతి సందర్భంగా నిర్వహించిన తెలంగాణ భాషా దినోత్సవ కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి  నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజల గోడును తన రచనల ద్వారా వినిపించిన అక్షర యోధుడు, ప్రజాకవి కాళోజీ చిరస్మరణీయులని అన్నారు. ప్రజాకవిగా పేరుగాంచిన కాళోజీ సాహితీ ప్రపంచంలో ప్రజాస్వామ్య ఆకాంక్షగా ప్రజల నోళ్లల్లో నిజమైన ప్రజా కవి కాళోజీ అన్నారు. తెలంగాణా సాహిత్యానికి, సాహితి సమరానికి నిలువెత్తు నిదర్శనం కాళోజి అని అందుకే ఆయన జన్మదినమైన ఈ రోజు ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించి  తెలంగాణా బాషా దినోత్సవంగా జరుపుకుంటున్నామని అన్నారు.నా గొడవ పరాభవం,హేమంతం రచనలు రాసి   , తన కవితలు, సాహిత్యం  ద్వారా   ప్రజలలో  ఉద్యమ స్ఫూర్తిని కలిగించడమే గాక  రాజకీయ, సాంఘీక చైతన్యం  తీకువచ్చి  ప్రశ్నించడం నేర్పించిన వ్యక్తి కాళోజి  అన్నారు.

తెలంగాణా భాషా సాహితి సేవ దిశగా సాగిన ఆయన పయనాన్ని స్ఫూర్తిగా తీసుకొని మాతృ భాషకు, సాహితి గౌరవాన్ని మరింతగా పెంచేందుకు సాహితీవేత్తలు కృషి చేయాలని అలాగే  ప్రజలు ఆయన  ఆశలు, ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు  సాగాలని కోరారు.

ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్లు రఘురాం శర్మ, శ్రీ హర్ష,  డి ఎస్ ఓ  రేవతి,డి పి ఆర్ ఓ చెన్నమ్మ, ఎం ఆర్ ఓ రాజు, ఏ ఓ శ్యాం ,కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

—————————————————————————–

జిల్లా పౌర సంబందాల అధికారి జోగులాంబ గద్వాల్ గారి చే జారి చేయబడినది.

Share This Post