ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకొని గురువారం కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ ఎన్. మధుసూధన్ కాళోజీ చిత్రపటానికి పూలమాలవేసి ఘంనగా నివాళులర్పించారు.

ప్రచురణార్ధం.

సెప్టెంబరు 09ఖమ్మం:

ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకొని గురువారం కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ ఎన్. మధుసూధన్ కాళోజీ చిత్రపటానికి పూలమాలవేసి ఘంనగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాళోజీ సేవలను స్మరిస్తూ తెలంగాణలో ప్రసిద్ధ కవుల్లో కవి కాళోజీ నారాయణరావు సుప్రసిద్ధ కవిగా పేరుగాంచారని, కాళోజీ నారాయణరావు జన్మదినాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భాషాదినోత్సవంగా ప్రకటించి కాళోజీ నారాయణరావును గౌరవించుచున్నదని అదనపు కలెక్టర్ తెలిపారు. తన రచనల ద్వారా ప్రజలను జాగృతం చేసిన గొప్ప రచయిత, కాళోజీ నారాయణరావు అని, తెలంగాణ భాష వ్యాప్తిచెందేవిధంగా కాళోజీ నారాయణరావు రచనలు ఉండేవని, ప్రతి ఒక్కరూ వారి రచనలు, సాహిత్యాన్ని స్పూర్తిగా తీసుకోవాలని అదనపు కలెక్టర్ కోరారు.

జిల్లా రెవెన్యూ అధికారి శ్రీమతి శిరీష, కలెక్టరేట్ పరిపాలనాధికారి మదన్ గోపాల్, కలెక్టరేట్ కార్యాలయపు పర్యవేక్షకులు, వివిధ విభాగాల సిబ్బంది తదితరులు కాళోజీ నారాయణరావుకు ఘననివాళులర్పించారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, ఖమ్మం వారిచే జారీచేయనైనది.

Share This Post