– ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యత .. – ఆరోగ్యానికి అండగా… ఆర్థిక భరోసా సీఎం సహాయ నిధి… – నియోజకవర్గంలోని 161 మంది లబ్ధిదారులకు రూ. 51 లక్షల సీఏంఆర్ఎఫ్ చెక్కులు అందజేత.. – చెక్కులను తమ బ్యాంకుఖాతాలో జమ చేసుకోవాలని లబ్ధిదారులను కోరిన మంత్రి హరీశ్ రావు..


ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యత ..

– ఆరోగ్యానికి అండగా… ఆర్థిక భరోసా సీఎం సహాయ నిధి…

– నియోజకవర్గంలోని 161 మంది లబ్ధిదారులకు రూ. 51 లక్షల సీఏంఆర్ఎఫ్ చెక్కులు అందజేత..

– చెక్కులను తమ బ్యాంకుఖాతాలో జమ చేసుకోవాలని లబ్ధిదారులను కోరిన మంత్రి హరీశ్ రావు..

అత్యవసరమైతేనే.. ప్రయివేటు ఆసుపత్రికి పోవాలని, సిద్ధిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నీ రకాల వైద్యులు, సేవలు అందుబాటులో ఉన్నాయని మంత్రి హరీశ్ రావు గారు స్పష్టం చేశారు.
ఆసుపత్రి వైద్యం కై వెళ్లి డబ్బులు ఖర్చు పెట్టలేని నిరుపేద కుటుంబాలకు చేదోడు వాదోడుగా ఉడుతా భక్తి కింద ముఖ్యమంత్రి సహాయ నిధి సాయం అందిస్తున్నట్లు మంత్రి హరీశ్ రావు గారు చెప్పారు.

జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో శనివారం రోజున నియోజకవర్గ పరిధిలోని 161 కుటుంబాలకు రూ.51 లక్షల 56 వేల 350 రూపాయలు కలిగిన సీఏంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిద్ధిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నీ రకాల సౌకర్యాలు, మిషన్లు, పరికరాలు అన్నీ ఏర్పాట్లు చేశామని, ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు. ఈ యేడాదిలో సిద్ధిపేట ప్రభుత్వ వైద్య కళాశాలలో క్యాత్ ల్యాబ్ వైద్య సేవలు అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. చివరి దశలో ఉన్న వృద్ధులకు , దీర్ఘకాలిక వ్యాధుల తో బాధపడుతున్న వారికి సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఆలన కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నాము అని , ఆర్థికంగా స్థోమత లేని వారికి ఆరోగ్య సేవలను అందించే గొప్ప కార్యక్రమని చెప్పారు.. ప్రయివేటు ఆసుపత్రిలో చేరే కంటే నిమ్స్ ఆసుపత్రిలో చేరితే ఎల్వీసి ఇప్పిస్త అని మంత్రి చెప్పారు.. ఆరోగ్యానికి అండగా, ఆర్థిక భరోసా గా సీఎం సహాయ నిది అండగా నిలుస్తున్నది అన్నారు.. ఈ చెక్కులను వెంటనే తమ బ్యాంకు ఖాతాలో జమ చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. చెక్కులు పొందేందుకు వచ్చిన ప్రతీ లబ్ధిదారు కడుపునిండా అన్నం తిని వెళ్లాలని మంత్రి కోరారు. ఈ మేరకు పట్టణంలోని 63 మందికి రూ. 20లక్షల 41 వేలు, సిద్ధిపేట రూరల్ మండలంలోని 18 మందికి రూ.5 లక్షల 46 వేల 350 , సిద్ధిపేట అర్బన్ మండలంలోని 11 మందికి రూ.4లక్షల 22 వేలు, చిన్నకోడూర్ మండలంలోని 31 మందికి రూ.9 లక్షల 23 వేలు, నంగునూరు మండలంలోని 23 మందికి రూ. 8 లక్షల 20 వేలు, నారాయణరావుపేట మండలంలోని 15 మందికి రూ.4 లక్షల 4 వేల రూపాయల చొప్పున మొత్తం రూ.51 లక్షల 56 వేల 350 రూపాయలు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. ఈ మేరకు రాష్ట్రంలో అత్యధికంగా 5836 మందికి రూ.24 కోట్ల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధిని సిద్ధిపేట నియోజకవర్గంలోనే అందించినట్లుగా మంత్రి తెలిపారు.
issued by dist Public Relations office siddipet

Share This Post