వార్త ప్రచురణార్ధం:
వరంగల్ జిల్లా, మార్చి 13.
జిల్లా కలెక్టరేట్ ప్రాంగణం లో జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి గారు ఆయుర్వేదిక్ శిబిరాన్ని ప్రారంభించి ప్రజాలకు అందుబాటులో ఉండేలా ప్రజల ఆరోగ్య సమస్యల పైన ఆయుర్వేదిక్ వైద్య చాలా ఉపయోగకరంగా ఉంటుందని, కోవిడ్ సమయంలో ప్రజలకి అందుబాటులో ఉన్న వైద్యం ఆయుర్వేదిక్ వైద్యం అని జిల్లా కలెక్టర్ అన్నారు.
ప్రజలదరికి ఆయుర్వేదిక్ వైద్యం పైన అవగాహణ కలిగించే విధంగా సోమవారం రోజున జిల్లా కలెక్టర్ ప్రాంగణంలో ఆయుర్వేదిక వైద్య శిభిరాన్ని ఏర్పాటు చేసిన ఉద్దేశమే ప్రజావాణికి వివిధ సమస్యల పైన జిల్లాలోని మారుమూల ప్రాంతాల నుండి వచ్చే ప్రజలకి ఆయుర్వేదిక వైద్యం గురించి అవగాహన కలిగించేలా ఈ రోజున ఆయుర్వేదిక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ అన్నారు. జిల్లా అధికారులకు ఆయుష్ వైద్య విధానం పైన ప్రొజెక్టర్ సహకారంతో యోగా ఆయుర్వేద వైధ్యం పైన డెమో ఇవ్వడం జరిగింది. అనంతరం ఆయుష్ కరదీపిక బుక్ లేట్ ను ప్రారంభించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు రెవెన్యూ శ్రీవత్సవ కోట, లోకల్ బాడీస్ అశ్విని తానాజీ వాకడే, ఆయుర్వేధిక డాక్టర్లు వారి సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. జిల్లా అధికారులతో పాటు, ఈ రోజు గ్రీవెన్స్ శిబిరంలో పాల్గొన్న ప్రజలతో సహా సుమారు ౩౦౦ మందికి ఉచిత పరీక్షలు చేసి మందులు అందించారు. అనంతరం ఆయుర్వేద వైద్యశాల మెడికల్ సూపరింటెండెంట్ డా. అనిశెట్టి శ్రీధర్ జిల్లా అధికారులకు ఆయుర్వేద వైద్య విధానం చికిత్స పద్ధతుల గురించి మరియు ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రిలో ఉన్న వివిధ స్పెషాలిటీ చికిత్స సదుపాయాలూ, ప్రత్యేక ఆయుర్వేద చికిత్సలయిన పంచకర్మ, క్షారసూత్ర వంటివి, కొన్ని పేషెంట్స్ కి సంబందించిన కేసు ప్రెసెంటేషన్స్ని పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా కలెక్టర్ గారి సమక్షంలో సవివరంగా వివరించారు. ఈ అవగాహనా కార్యక్రమములో జిల్లా అధికారులతో పాటు ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్ డా. విజయ గణేశ్వర్ రెడ్డి మరియు ఆయుష్ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ డా. రవి నాయక్ గారు పాల్గొన్నారు .