ప్రజావాణికి 42 దరఖాస్తులు స్వీకరించిన కలెక్టర్ ఉదయ్ కుమార్

జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి ప్రజా ఫిర్యాదుల కార్యక్రమంలో 42 ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ ఫిర్యాదుదారులు నుండి స్వీకరించారు.
వీటిని తక్షణం పరిశీలించి వాటిని పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. దరఖాస్తులను ఎక్కువకాలం పెండింగులో ఉంచరాదని, దరఖాస్తుదారుడు మళ్లీమళ్లీ తిరగకుండా పరిష్కరించాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో శ్రీనివాసులు, వివిధ శాఖల జిల్లా అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Post