ప్రజావాణిని పురస్కరించుకొని ప్రజల నుంచి ఫిర్యాదులు వినతులను దరఖాస్తుల స్వీకరణ అనంతరం ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులను ఉద్ధేశించి మాట్లాడిన జిల్లా కలెక్టర్ శ్రీ అనురాగ్ జయంతి పాల్గొన్న అదనపు కలెక్టర్ ఎన్. ఖిమ్య నాయక్

 

విద్యాసంస్థలు, వసతి గృహాల స్ట్రక్చర్ పరిస్థితి పై నేటి కల్లా రిపోర్ట్ అందజేయాలి

– సంక్షేమ, విద్యా శాఖ అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశం

– అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు తమ ఫీల్డ్ నెట్వర్క్ ను అప్రమత్తం చేయండి

– అన్ని గ్రామ పంచాయితీలు, మున్సిపాలిటీ లలో డ్రై డే ప్రభావవంతంగా జరిగేలా చూడాల్సిన బాధ్యత మండల ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, DPO దే

– శిథిలావస్థకు చేరి ప్రజా భద్రతకు ప్రమాదకారంగా మారిన కట్టడాలు, నిర్మాణాలను కూర్చి వేయాలి.

– బలహీన స్ట్రక్చర్ లు గుర్తించడం లో నిర్లక్ష్యం వహిస్తే బాధ్యుల పై కఠిన చర్యలు

– ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

——————————-

ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలు కురుస్తుండడం … రానున్న రోజుల్లో కూడ సాధారణం కు మించి వర్షాలు కురుస్తాయి అన్న సూచనల నేపథ్యంలో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు హై అలర్ట్ గా ఉండాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు.
జిల్లాలోని సంక్షేమ , విద్యా శాఖ లు సహా అన్ని ప్రభుత్వ శాఖలు
ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు, అంగన్వాడి, వసతి గృహాల స్ట్రక్చర్, క్షేత్ర కార్యాలయ భవనాల పరిస్థితి పరిశీలించి నేటి ( 19 వ తేదీ) కల్లా రిపోర్ట్ అందజేయాలనీ జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

సోమవారం ప్రజావాణిని పురస్కరించుకొని కాన్ఫరెన్స్ హాల్ లో ప్రజల నుంచి ఫిర్యాదులు వినతులను జిల్లా కలెక్టర్ స్వీకరించారు.

Revenue – 7, Civil Supply- 1,Dmho – 1,
Employment – 1, Dwo -1 చొప్పున మొత్తం 11 దరఖాస్తులు వచ్చాయి.

దరఖాస్తుల స్వీకరణ అనంతరం జిల్లా కలెక్టర్ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులను ఉద్ధేశించి మాట్లాడారు.

జిల్లాలో ఇప్పటివరకు కురవాల్సిన వర్షపాతం సాధారణ వర్షపాతం కంటే 120 శాతం అధికంగా వర్షపాతం నమోదయింది అన్నారు.
ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబరు మాసంలో కూడ వర్షపాతం ఉంటుందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలు తమ పరిధిలోని ప్రభుత్వ క్షేత్ర కార్యాలయాలు, వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో పాత స్ట్రక్చర్లు ఇప్పటికే కురిసిన భారీ వర్షాలకు బలహీనమయే అవకాశం ఉందన్నారు. తద్వారా విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ప్రమాదం వాటిల్లే ప్రమాదం ఉందని జిల్లా కలెక్టర్ తెలిపారు .
అన్ని ప్రభుత్వ శాఖల సంక్షేమ శాఖల అధికారులు సంబంధిత RCO లను సమన్వయం చేసుకుంటూ తమ పరిధిలోని ప్రతి స్ట్రక్చర్ నిశితంగా వెరిఫై చేయాలన్నారు. ప్రతి స్ట్రక్చర్ సురక్షితమ కాదా అని తేల్చి సంబంధిత రిపోర్టును తనకు అందజేయాలన్నారు.

మంగళవారం డ్రై డే కార్యక్రమం ఉన్నందున అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, వాటి పరిధిలో పనిచేసే క్షేత్ర కార్యాలయాలు, విద్యాసంస్థల్లో తప్పనిసరిగా డ్రై డే కార్యక్రమాన్ని చేపట్టి కార్యాలయాలు పాఠశాలలు వాటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవలసిన బాధ్యత సంబంధిత జిల్లా అధికారులు క్షేత్ర అధికారులకు ఉందన్నారు ఆ దిశగా వెంటనే క్షేత్ర సిబ్బందికి ఆదేశాలు జారీ చేయాలన్నారు. డై డే వల్ల దోమల వృద్ధిని అరికట్టవచ్చునని తెలిపారు.

అలాగే కొత్త పంచాయతీ రాజ్ చట్టం, మున్సిపల్ చట్టం ప్రకారం తమ పరిధిలోని శిథిలావస్థకు చేరుకున్న భవనాలను నిర్మాణాలను ప్రజా భద్రత దృష్ట్యా తొలగించే బాధ్యతను కమిషనర్లు, సెక్రెటరీ ల దేనని చట్టంలో స్పష్టంగా స్పష్టం చేయడం జరిగిందన్నారు.
ఫీల్డ్ నెట్వర్క్ ను అప్రమత్తం చేసుకుంటూ వెంటనే శిథిలావస్థకు చేరుకొని కూలేందుకు సిద్ధంగా ఉన్న భవనాలను, నిర్మాణాలను వెంటనే నేలమట్టం చేయాలని జిల్లా కలెక్టర్ మున్సిపల్, పంచాయితీ రాజ్ అధికారులకు సూచించారు.

ఇంటర్మీడియట్ జిల్లా అధికారి ,జిల్లా విద్యాధికారులు తమ పరిధిలోని పాఠశాలలో బలహీనమైన స్ట్రక్చర్లను కిచెన్ షెల్టర్ టాయిలెట్స్ తరగతి గదులను స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్, ప్రధానోపాధ్యాయులను సమన్వయం చేసుకుంటూ గుర్తించి భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. బలహీన స్ట్రక్చర్ లను కూల్చి వేయాలన్నారు.
ఈ విషయంలో అలక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

వైద్యారోగ్య శాఖ అధికారులు కూడా తమ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ప్రాథమిక ఉప ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేసి స్ట్రక్చర్ల నిర్మాణాల పరిస్థితి పై రిపోర్ట్ అందజేయాలన్నారు.
మండల ప్రత్యేక అధికారులు తమ మండలాల పరిధిలో డ్రైడే జరుగుతున్న తీరును పర్యవేక్షణ చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అలాగే పంచాయతీల పనితీరును పర్యవేక్షణ చేసే బాధ్యతను కూడా ప్రత్యేక అధికారులు తీసుకోవాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ,ప్రజలు విష జ్వరాల బారిన పడకుండా ఉండేందుకు అన్ని మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలో నిరంతరం పారిశుద్ధ కార్యక్రమాలు ప్రభావంతంగా అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత ప్రత్యేక అధికారుల దేనిని స్పష్టం చేశారు

అలాగే జిల్లాలో ప్రమాదకర ఓపెన్ డ్రైన్ లు, మ్యాన్ హోల్ లను గుర్తించి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్లను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

వర్షాల నేపథ్యంలో త్రాగునీటి సరఫరా వ్యవస్థలో అక్కడక్కడ ఏర్పడే లీకేజీల వల్ల త్రాగునీరు కలుషితమయ్యే అవకాశం ఉన్నందున ప్రజలకు సురక్షిత త్రాగునీరు సరఫరా అయ్యేలా చూడాల్సిన బాధ్యత మిషన్ భగీరథ అధికారుల దేనిని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.

దెబ్బతిన్న అన్ని రోడ్లకు మరమ్మత్తులు చేపడుతాం:

జిల్లాలో భారీ వర్షాలకు దెబ్బతిన్న, కోత కు గురైన అర్ అండ్ బి, పంచాయితీ రాజ్ రోడ్లకు సాధ్యమైనంత త్వరగా మరమ్మత్తులు చేపడుతామని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. ఆదిశగా చర్యలు చేపట్టాలనీ ఇంజనీరింగ్ అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

ప్రజావాణి లో జిల్లా అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్, ఆర్డీఓ లీల తదితరులు పాల్గొన్నారు.

——————————–

 

Share This Post