ప్రజావాణిలో ప్రజలు వివిధ సమస్యలకు పరిష్కారం కోరుతూ సమర్పించిన పిర్యాదులను అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు.

ప్రజావాణిలో ప్రజలు వివిధ సమస్యలకు పరిష్కారం కోరుతూ సమర్పించిన పిర్యాదులను   అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని  పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి  తెలిపారు.

సోమవారం కల్లెక్టరేట్ సమావేశం హాలు నందు నిర్వహించిన ప్రజావాణి లో జిల్లా లోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి   పిర్యాదులను జిల్లా కలెక్టర్ , అదనపు కలెక్టర్ రఘురాం శర్మ స్వీకరించారు. ప్రజావాణి లో మొత్తం  30   పిర్యాదులు వచ్చాయని తెలిపారు. పిర్యాదులు ఎక్కువగా భూ సమస్యలు, ఆసరా పెన్షన్లు, ఇతర సమస్యలకు సంబంధించినవి వచ్చాయని అన్నారు. ప్రజావాణి ద్వారా స్వీకరించిన పిర్యాదులకు సంబంధించిన సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామని , పిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించిన తరవాత  సంబంధిత అధికారులకు పంపించి,  పరిష్కరించేలా చర్యలు చేపడతామని అన్నారు.

అనంతరం కల్లెక్టరేట్ సమావేశం హాలు నందు  నూతన సంవత్సరం సందర్బంగా కార్యాలయ సిబ్బంది సమక్షం లో జిల్లా కలెక్టర్ గారు కేకు కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరం లో ఉద్యోగులందరు నూతన ఉత్సాహం తో విధులు నిర్వర్తించాలని ఉద్యోగులను కోరారు.

సమావేశం లో అదనపు కలెక్టర్ శ్రీహర్ష , ఏ ఓ ఎల్లయ్య, మదన్ మోహన్, కార్యాలయ  సిబ్బంది,  తదితరులు, పాల్గొన్నారు.

———————————————————————————-

జిల్లా పౌర సంబంధాల అధికారి జోగుళాంబ గద్వాల జిల్లా గారి చె జారి చేయనైనది.

 

Share This Post