ప్రజావాణిలో ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను అధిక ప్రాధాన్యతనిచ్చి వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ మను చౌదరి జిల్లా అధికారులను ఆదేశించారు.
సోమవారం నాడు జిల్లా కలెక్టరేట్ ప్రజావాణి మీటింగ్ హాలులో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వివిధ శాఖలకు సంబంధించి 32 ఫిర్యాదులను అదనపు కలెక్టర్లు మను చౌదరి, రాజేష్ కుమార్ లు స్వీకరించారు.
అదనపు కలెక్టరు మను చౌదరి జిల్లా అధికారులతో మాట్లాడుతూ, ప్రజావాణి ద్వారా ప్రజలు ఇచ్చిన సమస్యల దరఖాస్తులను ఎలాంటి పెండింగ్ లేకుండా సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు.