ప్రజావాణిలో ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించేలా అధికారులు పని చేయాలి ప్రజావాణిలో ప్రజల సమస్యలు తెలుసుకొన్న జిల్లా అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, శ్యాంసన్

పత్రిక ప్రకటన–1 తేదీ : 26–09–2022
============================================
ప్రజావాణిలో ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించేలా అధికారులు పని చేయాలి
ప్రజావాణిలో ప్రజల సమస్యలు తెలుసుకొన్న జిల్లా అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, శ్యాంసన్
జిల్లా వ్యాప్తంగా ప్రజావాణిలో 65 వినతులు స్వీకరించిన అదనపు కలెక్టర్లు
ప్రజావాణిలో ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించేలా జిల్లా అధికారులు పని చేయాలని ఈ విషయంలో సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు అందించిన విజ్ఞప్తులను ఏమాత్రం పెండింగ్లో ఉంచకుండా వేగవంతంగా అవసరమైన చర్యలు తీసుకొని సమస్యలను పరిష్కరించాలని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, శ్యాంసన్ అన్నారు. సోమవారం శామీర్పేటలోని కలెక్టరేట్ ప్రజావాణి హాల్లో జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్తో కలిసి ప్రజల నుంచి వచ్చిన 65 వినతులు, ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు ఆయా శాఖల అధికారులు పరిష్కరించాల్సిందిగా అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, శ్యాంసన్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Post