పత్రిక ప్రకటన
తేదీ : 28–11–2022
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి,
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి,
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులు త్వరితగతిన పరిష్కరించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి అన్నారు.
సోమవారం శామీర్పేట్ కలెక్టరేట్లోని ప్రజావాణి హాల్లో జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్తో కలిసి ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని జిల్లాలోని ఆయా ప్రాంతాల నుంచి తమ సమస్యలు విన్నవించుకొనేందుకు వచ్చిన ప్రజల వినతులు, దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా 75 దరఖాస్తులు వచ్చాయని అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణి ద్వారా వచ్చిన వినతులు, దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులు వెంటనే పరిశీలించి అందుకు అవసరమైన చర్యలు తీసుకొని వాటిని పరిష్కరించాలని తెలిపినారు ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.