*ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులకు ప్రాధాన్యత నివ్వాలి:: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా

*ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులకు ప్రాధాన్యత నివ్వాలి:: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా

*ప్రచురణార్థం-1*

*ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులకు ప్రాధాన్యత నివ్వాలి:: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా*

జయశంకర్ భూపాలపల్లి, మే 2: ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తులకు ప్రాధాన్యత నిచ్చి, వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు. సోమవారం జయశంకర్ భూపాలపల్లి కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజల నుండి కలెక్టర్ దరఖాస్తులు స్వీకరించారు. ప్రజావాణిలో చెల్పూర్ గ్రామస్తులు 2009 లో జెన్ కో వారు తమ భూములను తీసుకొని ఇంతవరకు డబ్బులు చెల్లించలేదని సుమారుగా 40 కుటుంబాలు సహాయం కోసం ఎదురుచూస్తున్నారని గ్రామస్తులు అందరూ కలిసి కలెక్టర్ కు దరఖాస్తు చేసుకున్నారు. మల్హర్ మండలం చిమన్ తండా గ్రామస్తులు తేరాల నర్సింగరావు తన భూమి వివరాలు పాస్ బుక్ లో నమోదు కాలేదని దరఖాస్తు చేస్తున్నారు. రేగొండ మండలం, రేపాక గ్రామస్తుడు చవాటి రాజు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కు సంబంధించిన దరఖాస్తు చేసుకున్నారు. మహాదేవపూర్ వాసి కేదారి సుశీల తన 20 గుంటల భూమి ప్రాజెక్టు కింద పోయిందని దాని పరిహారం ఇప్పించాలని గా దరఖాస్తు చేసుకున్నారు. మహాదేవపూర్ మండలానికి చెందిన ఎస్సి, ఎస్టిలకు చెందిన కొన్ని కుటుంబాల యొక్క భూములు ఆన్ లైన్ లో నమోదు కాలేదని దీనివల్ల రైతు బంధు పథకం రావడం లేదని కలెక్టర్ కు దరఖాస్తు చేసుకున్నారు. భూపాలపల్లి మండలం పెద్దాపూర్ గ్రామస్తులు సిహెచ్ శారద తన ఆరు ఎకరాల భూమి పాస్ బుక్ నందు నమోదు చేయడం లేదని జిల్లా కలెక్టర్ కు దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ రెవెన్యూ అసోసియేషన్ భూపాలపల్లి సంఘ భవన నిర్మాణం కొరకు స్థలం కేటాయించి వలసిందిగా కలెక్టర్ కు జిల్లాకు చెందిన తహశీల్దార్లు కలెక్టర్ కు దరఖాస్తు చేసుకున్నారు. పరశురాం పల్లి గ్రామస్తుడు ఓసి త్రీ లో భూమి కోల్పోయిన నష్ట పరిహారం ఇంకా అందలేదని సింగరేణి అధికారులు పరిహార మంజూరుకు తీవ్ర జాప్యం చేస్తున్నారని దరఖాస్తు చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
———————————————-
జిల్లా పౌరసంబంధాల అధికారి, జయశంకర్ భూపాలపల్లి కార్యాలయంచే జారిచేయనైనది.

Share This Post