ప్రజావాణిలో వచ్చిన పిర్యాదులపై తీసుకున్న చర్యల నివేదికలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు

. సోమవారం కలెక్టరేట్ నందు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి సమస్యల వినతులు స్వీకరించి పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులకు ఎండార్స్ చేసినట్లు చెప్పారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వారం రోజుల్లో పరిష్కరించాలని, పిర్యాదుదారునికి లిఖితపూర్వకంగా లేఖలు వ్రాయాలని చెప్పారు. ప్రజావాణిలో వచ్చిన వినతులు కొన్ని: ఇల్లందు మండలం, కళాసిబస్తీకి చెందిన పోతు శబరీష్ తన తండ్రి శ్రీనివాసరావు చౌకదుకాణపు డీలరుగా పనిచేస్తూ మరణించారని, అట్టి చౌకదుకాణాన్ని తనకు కేటాయించాలని కోరుతూ ధరఖాస్తు చేశారు.

లక్ష్మీదేవిపల్లి మండలం కారుకొండ గ్రామా చెందిన కె. వెంకటరమణ తన భర్త మరణించారని, యంఏ బిఈడితో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన  తాను గతంలో  ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేశానని, కరోనా వల్ల ఉద్యోగం తీసేశారని, ప్రస్తుతం ఖాళిగా ఉంటున్నానని, ఇద్దరు పిల్లలతో పాటు వయోవృద్ధురాలైన అత్త యొక్క పోషణ చేయడానికి ఇబ్బందిగా ఉన్నదని, తనకు ఆ గ్రామంలో మీ సేవా కేంద్రం ఏర్పాటు చేసి  నిర్వహించుటకు తనకు అవకాశం కల్పించాలని కోరారు.   సింగరేణి మండలం, పేరుపల్లి గ్రామానికి చెందిన కె.పద్మ బూర్గంపాడు మండలం, ఇరవెండి గ్రామ పరిధిలోని సర్వే: నెం. 187 లోని 2 ఎకరాలు భూమిని తన తండ్రిగారి ద్వారా  వారసత్వంగా ఇచ్చియున్నదని అట్టి భూమిని తన తమ్ముడు ఆక్రమించి  పాసుబుక్కు తీసుకున్నాడని,  అట్టి పాసు బుక్కును రద్దు చేసి తన పేరున పాసు బుక్ మంజూరు చేయాలని కోరారు. అశ్వారావుపేట మండలం, ఉసిర్లగూడెం గ్రామానికి చెందిన ఎస్ రుక్మిణి సర్వే నెం. 631లో ఉన్న ఎకరం భూమి సీతారామ ప్రాజెక్టు పంట కాలువ నిర్మాణంలో పోతున్నందున పరిహారం క్రింద ప్రభుత్వం 8 లక్షల రూపాయలు నాయొక్క బ్యాంకు  ఖాత నందు డిపాజిట్ చేయడం జరిగిందని, అలా ప్రభుత్వం ఇచ్చిన ప్యాకేజికి సంబంధించిన  నగదును వినాయకపురం ఆంధ్రాబ్యాంకు మేనేజర్ తీసుకోవడానికి వీల్లేకుండా నిలిపివేయడం (హో ల్డ్) జరిగిందని సమస్యను పరిష్కరించి నగదు తీసుకోవడానికి అవకాశం కల్పించాలని చేసిన దరఖాస్తుపై తగు చర్యలు తీసుకోవాలని ఎలెడియంను  ఆదేశించారు. జూలూరుపాడు మండలం, పాపకొల్లు గ్రామానికి చెందిన ఆర్ లక్ష్మీనారాయణ సర్వే నెం. 804/1లో ఉన్న ఎకరం భూమికి నాలుగు సార్లు రైతుబంధు నిధులు కూడా

మంజూరయ్యాయని కానీ ఈ సంవత్సరం రైతుబంధు నిధులు మంజూరు కాలేదని తనకు రైతుబంధు నిధులు మంజూరు చేయు విధంగా చర్యలు తీసుకోవాలని వినతి చేశారు. దమ్మపేట మండలం, వడ్లగూడెం గ్రామానికి చెందిన పి. కుసుమాంజలి తన భర్త మే నెలలో కరోనాతో మరణించారని తనకు వితంతు పింఛను మంజూరు చేయాలని చేసిన దరఖాస్తును తగు చర్యలు తీసుకోవాలని డిఆర్డిఓకు ఎండార్స్ చేశారు. పాల్వంచ మండలం, నవభారత్, అఫ్జల్ పర్వీన్  కాలనీ నివాసులు తమకు రహదారి సౌకర్యం లేదని, మురుగునీరు వెళ్లేందుకు కాలువలు కూడా కట్టలేదని కావున తమకు రహదారి సౌకర్యంతో పాటు మురుగునీటి కాలువలు నిర్మించాలని దరఖాస్తు చేశారు.

ఈ కార్యక్రమంలో డిఆర్ఓ అశోక్ చక్రవర్తి, డిపిఓ రమాకాంత్, డిఆర్డిఓ మధుసూదన్ రాజు, ఆర్డీఓ  స్వర్ణలత అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post