ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును పరిష్కరించే దిశగా చర్యలు, ప్రజావాణి వినతులు స్వీకరించిన జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, జిల్లా అధికారులు.


జిల్లా వ్యాప్తంగా ప్రజావాణిలో 108 దరఖాస్తులు స్వీకరించిన అధికారులు,
జిల్లాలో ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును స్వీకరించి వాటిని పరిష్కరించే దిశగా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఈ విషయంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్ అన్నారు. సోమవారం శామీర్పేట కలెక్టరేట్లోని ప్రజావాణి హాల్లో జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, జిల్లా లా ఆఫీసర్ చంద్రావతి, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారిణి పద్మజారాణితో కలిసి ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులు, విజ్ఞప్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజావాణిలో మొత్తం 108 దరఖాస్తులు రాగా అందులో ఆయా శాఖలకు సంబంధించిన విజ్ఞప్తులు, దరఖాస్తులను సంబంధిత శాఖల జిల్లా అధికారులకు అందచేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Share This Post