ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తు పరిష్కరించు విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు.

సోమవారం కలెక్టరేట్ సమావేశపు హాలు నందు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొని జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి సమస్యల యొక్క వినతులను స్వీకరించి పరిష్కరించాలని ఆదేశించారు. సమస్య పరిష్కరించాలని ప్రజలు ఇచ్చిన దరఖాస్తును కూలంకషంగా పరిశీలించి పరిష్కార స్వభావంపై ప్రజలకు లిఖితపూర్వకంగా తెలియచేయాలని చెప్పారు. సమస్యను పరిష్కరించాలని ప్రజావాణిలో ప్రజలు అందచేసిన దరఖాస్తులు కొన్ని: జూలూరుపాడు మండలం, పాపకొల్లు గ్రామానికి చెందిన పి. చందర్రావు పాపకొల్లు గ్రామపంచాయతీ సర్పంచు విద్యుత్ సామాన్లుతో పాటు విద్యుత్ పనులు చేసియున్నానని, తనకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని తనకు నిధులు చెల్లింపులు చేయు విధంగా చర్యలు తీసుకోవాలని చేసిన దరఖాస్తును తగు చర్యలు నిమిత్తం డిపిఓకు ఎండార్స్ చేశారు. పాల్వంచ మండలానికి చెందిన బి. సాయిక్రిష్ణ తన తల్లి అరుణావతి తేది 12-7-2021వ తేదీన విద్యుత్ ఘాతానికి గురై మరణించారని, ఫ్యామిలి ధృవీకరణ కొరకు దరఖాస్తు చేయగా మీ అమ్మగారికి నీవు కాక వేరే కుటుంబ . సభ్యులున్నారని అందుకే తిరస్కరించామని చెప్పారని, తిరిగి రెండవసారి దరఖాస్తు చేయగా మొదటిసారి తిరస్కరించిన విధంగానే చేశారని, తన తల్లిగారికి తాను తప్ప వేరే కుటుంబ సభ్యులు లేరని, విచారణ నిర్వహించి తనకు ఫ్యామిలి ధృవీకరణ పత్రం జారీ చేయు విధంగా చర్యలు తీసుకోవాలని చేసిన దరఖాస్తును తగుచర్యలు నిమ్తం ఓఎస్టీకి ఎండార్స్ చేశారు. టేకులపల్లి మండలం, తుమ్మల చెలక గ్రామానికి చెందిన బానోత్ నరేష్ తాను బిటెక్ చదివిన నిరుద్యోగినని, స్వయం ఉపాధి కొరకు తుమ్మలచెలక లేదా రేకులతండాలో మీ సేవా కేంద్రం ఏర్పాటు చేయుటకు తనకు అవకాశం కల్పించాలని చేసిన దరఖాస్తును తగు చర్యలు నిమిత్తం ఈడియంకు ఎండార్స్ చేశారు. చంద్రుగొండ మంలం, పోకలగూడెం గ్రామానికి చెందిన భూక్యా రాధాక్రిష్ణ తన వ్యవసాయ బోరు ప్రక్కన 10 అడుగుల దూరంలో బోరు వేయడం వల్ల తనకు నీటి సౌకర్యం తగ్గిపోయిందని, దీని వల్ల తన పొలాలకు నీటి సౌకర్యం లేక ఎండిపోతున్నాయని, కాబట్టి అట్టి బోరును సీజ్ చేసి తనకు న్యాయం చేయాలని చేసిన దరఖాస్తును తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా తహసిల్దార్కు ఎండార్స్ చేశారు.. చుంచుపల్లి మండలం, నందాతండాకు చెందిన చెన్నం రాజు పలివెల సీతారామరావు వద్ద సర్వే నెం. 1208లో కొనుగోలు చేయబడిన 5 ఎకరాల భూమి తన స్వాధీనంలోనే ఉన్నదని, రెవిన్యూ రికార్డుల్లో తన పేరు నమోదు చేసి పట్టాదారు పాసుపుస్తకం మంజూరు చేయాల్సిందిగా చేసిన దరఖాస్తును తగు చర్యలు నిమిత్తం సి సెక్షన్ పర్యవేక్షకులకు ఎండార్స్ చేశారు. దుమ్ముగూడెం మండలం, తూరుబాక గ్రామానికి చెందిన వి కిరణ్ తాను 10వ తరగతి వరకు చదువుకున్నానని, వికలాంగుడిని కావడం చేత కూలి పనులు చేసుకోలేకపోతున్నానని, కుటుంబ పోషణ కొరకు తనకు ఉపాధి అవకాశాలు కల్పించాల్సిందిగా చేసిన దరఖాస్తును జిల్లా ఉపాధికల్పనాధికారికి తగు చర్యలు నిమిత్తం ఎండాక్స్ చేశారు. మణుగూరు మున్సిపార్టీకి చెందిన నిట్ట సరోజ వికలాంగుల పించను మంజూరుకు చేసిన దరఖాస్తును పరిశీలించిన అదనపు కలెక్టర్ తగు చర్యలు నిమిత్తం డిఆర్ఓకు ఎండార్స్ చేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్క్ అశోక్ చక్రవర్తి, డిఆర్డిఓ మధుసూధన్ రాజు, డీపీఓ రమాకాంత్ అన్ని శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post