ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ డి. శ్రీనివాస రెడ్డి జిల్లా అధికారులకు సూచించారు.

సోమవారం ప్రజావాణి సందర్భంగా ఆయన జిల్లా కలెక్టర్ ఛాంబర్లో  ప్రజల నుండి 64 ఫిర్యాదులను స్వీకరించారు.
వీటిలో 45 ఫిర్యాదులు రెవెన్యూ భూ సమస్యలకు సంబంధించినవి కాగా,  మిగతావి జిల్లా పంచాయతీ,  మున్సిపాలిటీలు, ఇతర శాఖలకు సంబంధించినవి ఉన్నాయి.
కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలనాధికారి నాగేశ్వర చారి,  జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Share This Post