ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ రమేష్ అధికారులకు సూచించారు

ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ రమేష్ అధికారులకు సూచించారు

ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ రమేష్ అధికారులకు సూచించారు . సోమవారం నిర్వహించిన ప్రజావాణికి జిల్లా నలుమూలల నుండి 39 విజ్ఞప్తులు వచ్చాయి. ప్రధానంగా భూ వివాదాలు, విద్యుత్, రెండు పడకల గదుల ఇండ్లు కావాలని తదితర ఫిర్యాదులందాయి. అందులో రెవిన్యూ విభాగానికి సంబంధించి 25 విజ్ఞప్తులు రాగా, మునిసిపాలిటి సంబంధించి 3, ఇతర శాఖలకు సంబంధించి 11 దరఖాస్తులు వచ్చాయి.
అందులో కొన్ని ఫిర్యాదులు ఇలా..
రెవిన్యూ, ఫారెస్ట్ శాఖల మధ్య వివాదంలో ఉన్న తన భూమిని పరిష్కరించవలసినదిగా నార్సింగి మండలం సంఖాపూర్ గ్రామానికి చెందిన నేనావత్ శంకర్ అభ్యర్థించారు.
వారసత్వంగా రావలసిన భూమిపై కోర్టులో కేసు ఉండగా మా ఇద్దరు చెల్లెళ్లపై రిజిస్టర్ చేశారని తనకు న్యాయం చేయవలసినదిగా శంకరంపేట్ మండలం ఆరేపల్లికి చెందిన రుక్మిణి బాయి విజ్ఞప్తి చేశారు.
ధరణీలో తప్పుగా చూయిస్తున్న సర్వే నెంబర్లను సరిచేయవలసినదిగా చేగుంట మండలం వడియారానికి చెందిన యాదగిరి,పాపయ్య,శంకర్ లు కోరారు.
అల్లాదుర్గ్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు కొరకు కేటాయించిన పాత భవనాన్ని మరమ్మతులు చేసి మౌలిక వసతులు కల్పించవలసినదిగా అల్లాదుర్గ్ అసెంబ్లీ నియోజక వర్గ సాధన సమితి అధ్యక్షులు బ్రహ్మం కోరారు.
నరసాపూర్ లోని 14 వ వార్డులో రోడ్డును ఆక్రమిస్తూ అక్రమంగా నిర్మిస్తున్న మెట్లను తొలగించవలసినదిగా అశోక్ ఫిర్యాదు చేయగా తగు చర్య తీసుకోవలసిందిగా మునిసిపల్ కమీషనర్ కు సూచించారు.
మెదక్ పట్టణం రాంనగర్ కాలనీలో నిబంధనలకు విరుద్ధంగా అనుమతి లేకుండా నిర్మాణం గావిస్తున్న ఇంటిని నిలుపుదల చేయవలసినదిగా కమ్మరి సుభద్ర ఫిర్యాదు చేశారు.
టేక్మాల్ ఎస్.సి కాలనీలోఖాళీ అవుతున్న అంగన్వాడీ టీచర్ పోస్ట్ ఇప్పించవలసిందిగా రేణుక అభ్యర్థించారు.
ఈ సమావేశంలో డి.ఎస్.ఓ. శ్రీనివాస్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వెంకటేశ్వర రావు, నీటిపారుదల ఏఈ శ్రీనివాస్ రావు, అబ్కారి అధికారి రజాక్, జిల్లా యువజన క్రీడల అధికారి నాగరాజ్, కలెక్టరేట్ ఏ.ఓ. మన్నన్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post