ప్రజావాణిలో వచ్చిన వినతులకు సంబంధించి సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలి,

పత్రిక ప్రకటన–1 తేదీ : 31–10–2022
===========================================
ప్రజావాణిలో వచ్చిన వినతులకు సంబంధించి సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలి,
ప్రజావాణిలో వినతులు స్వీకరించిన జిల్లా అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, శ్యాంసన్,
ప్రజావాణిలో 55 వినతులు స్వీకరించిన అదనపు కలెక్టర్లు,
జిల్లా వ్యాప్తంగా ప్రజావాణిలో ప్రజల నుంచి వచ్చే వినతులు, విజ్ఞప్తులు, సమస్యలను వచ్చిన వెంటనే వాటిని పరిష్కరించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఈ విషయంలో సంబంధిత శాఖల అధికారులు అన్ని రకలుగా వినతులకు స్పందించాలని అప్పుడే ప్రజా సమస్యలు పరిష్కారమవుతాయని మేడ్చల్ –- మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, శ్యాంసన్ అన్నారు. సోమవారం శామీర్పేటలోని కలెక్టరేట్ ప్రజావాణి హాల్లో జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్తో కలిసి జిల్లా వ్యాప్తంగా ప్రజావాణిలో ప్రజల నుంచి వచ్చిన 55 వినతులు, ఫిర్యాదులు, విజ్ఞప్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు ఆయా శాఖల అధికారులు వెంటనే పరిష్కరించి ప్రజల ఇబ్బందులు తీర్చాల్సిన బాధ్యత ఉందని దీనిని దృష్టిలో పెట్టుకొని సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని అదనపు కలెక్టర్లు ఆయా శాఖల అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Post